Close

Press Release

Filter by:

రాబోయే రబి కాలంలో కెఎన్ఎం 12368 సన్నని ధాన్యం రకం పండించడానిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Published on: 21/07/2025

భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం 12368 అనే సన్నని ధాన్యం వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెఎన్ఎం 12368 రకం రాబోయే రబి […]

More

జిల్లాలోని వ్యవసాయ ఆధారిత భూములలో ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 21/07/2025

సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా “పచ్చిరొట్ట ఫైర్లకు వాడడం ద్వారా చేకూరే ప్రయోజనాలపై” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధిక ఎరువులు వినియోగం కారణంగా భూసారం దెబ్బతిని జీవం కోల్పోవడంతో భూమి సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. పచ్చిరొట్ట పైర్లను వాడడం ద్వారా 25% ఎరువులను ఆడా చేసుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుంది అన్నారు. వర్షాకాలానికి ముందు […]

More

పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Published on: 21/07/2025

ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్గీత గడువలోపున నాణ్యమైన పరిష్కారం చూపాలి. పెంచి పోషించిన ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు పట్ల ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి వృద్ధులైన తల్లిదండ్రులు నిరాధారణకు గురి చేస్తే చర్యలు తప్పవు.. .. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా […]

More

జిల్లాలో మార్గదర్శకుల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/07/2025

మానవ సేవే…… మాధవ సేవ… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజసేవలో భాగమే. పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ చదలవాడ నాగరాణి పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి4 కార్యక్రమాన్ని […]

More

ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 19/07/2025

ఏ.ఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. పశ్చిమగోదావరి జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టి, బీసీ, ఒబిసి, ఇబిసి ధ్రువ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలలో రెవెన్యూ శాఖ […]

More

జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 19/07/2025

స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం భీమవరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో మావుళ్ళమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత 6 నెలలుగా పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా […]

More

విద్యార్థులకు చిన్న నాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం ద్వారా, ప్లాస్టిక్ ని సమర్థవంతంగా నిరోధించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 19/07/2025

మూడవ శనివారం స్వచ్ఛంద స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన” పై తణుకు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ నెలా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతినెల ఒక థీమ్ తో నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా […]

More

పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ప్రత్యేక అధికారి మరియు మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి పిలుపునిచ్చారు.

Published on: 19/07/2025

ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తణుకు మాంటిసోరి హై స్కూల్, జూనియర్ కాలేజ్ ల నందు ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం” అనే కార్యక్రమంలో పాల్గొని, సైన్స్ స్క్వేర్ ప్రదర్శనను తిలకించి, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జిల్లా ప్రత్యేక అధికారి విద్యార్థులతో మాట్లాడుతూ మీరు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వి […]

More

గుర్రపుడెక్కతో తయారుచేసిన వర్మి కంపోస్ట్ ను రైతులు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/07/2025

ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో గ్రామ సమైక్య సభ్యులు గుర్రపు డెక్క ద్వారా తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. తొలుత గ్రామ సమైక్య సభ్యులతో మాట్లాడుతూ తయారీ విధానాన్ని, ఎంతమంది యూనిట్ లో పనిచేస్తున్నారు, ఎన్ని రోజులకు కంపోస్ట్ తయారవుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో .. భీమవరం మండలం గొల్లవానితిప్ప, […]

More

ఎంజాయ్ మెంట్ సర్వే భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 18/07/2025

మొగల్తూరు మండలంలోని కాళీపట్నం రెవిన్యూ గ్రామ పరిధిలో పాతపాడు, జగన్నాధపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర, కొత్తోట గ్రామాల సెటిల్మెంట్ భూములు సంబంధించి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎంజాయిమెంట్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భూములకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగన్నాధపురం సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ ఏటువంటి పొరపాట్లు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా […]

More