Close

Press Release

Filter by:

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 01/08/2025

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాకు కొత్తగా 3988 పింఛన్లు మంజూరు. శుక్రవారం పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలో వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు స్థానిక జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో 15 మందికి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారుల […]

More

అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

Published on: 31/07/2025

రైతులకు లాభసాటి వ్యవసాయం, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల విశ్వాసానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనంపై గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు రెండో తేదీన అన్నదాత సుఖీభవ […]

More

జిల్లాలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారస్తులు సహకరించాలి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 30/07/2025

నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించాలి మార్కెట్ ధరలు పెరగకుండా టోకు వర్తకులు సహకరించాలి నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించి మార్కెట్లో ధరలు పెరగకుండా సహకరించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను కోరారు. . బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా లోని చాంబర్ ఆఫ్ కామర్స్, కూరగాయలు ,వర్తక సంఘాలు సభ్యులతో నిత్యవసర సరుకులు నియంత్రణపై ఇన్చార్జి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. […]

More

పి4లో భాగంగా సంపన్నులు దిగువ పేద వర్గాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకు రావాలి-ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 30/07/2025

పి4 లో భాగంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు […]

More

పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామం ఇనామ్ రికార్డులను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 30/07/2025

పెంటపాడు మండలం తహసిల్దార్ కార్యాలయంను మంగళవారం ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి సంబంధించిన ఇనామ్ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో రెవిన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పుంతకు చెందిన భూ స్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామంలో నెంబర్.14 ప్రభుత్వ […]

More

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజ సేవే- జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 29/07/2025

పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమ వంతు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పి4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాల వారిని ఆర్థికంగా, […]

More

వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకుర్లుకు విరివిగా రుణాలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/07/2025

గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి లకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరు పై కలెక్టర్ ఆగ్రహం .. సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతుల అందరికీ రుణాలు అందించాలి చేనేత కార్మికులు ముద్ర రుణాలు మంజూరులో తాత్సారం ఎందుకు? పీఎం ఎఫ్ బి వై ప్రీమియం జమలో నిర్లిప్తత ఎందుకు? రైతులు పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా […]

More

సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 29/07/2025

మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోస్, ఎంఈఓస్, ఏపీఎంస్, మున్సిపల్ కమిషనర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత 2025-26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ద్వారా జిల్లాలో 15 – 59 వయస్సు […]

More

జీరో పోవర్టీ సమాజ నిర్మాణానికి స్థితిమంతులు ముందుకు రావాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 28/07/2025

జిల్లాలో మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాలకు అనుసంధానం వేగవంతం చేయాలి. పి-4 గ్రామ సభలను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేయాలి. పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గం, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1,623 […]

More

అధిక పోషక విలువలు కలిగిన గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్ వినియోగానికి రైతుల ముందుకు రావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 28/07/2025

జిల్లాలోని 20 మండలాల్లో 60 ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.. రైతులు ఎరువులు వినియోగం తగ్గించి, గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ ను వినియోగించాలి… ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి గ్రూప్ ల ద్వారా గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ తయారీ. జిల్లాలోని సాగు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన గుర్రపు డెక్కన్ తొలగించి రైతులకు మేలు చేసేలా వర్మీ కంపోస్ట్ ను తయారు చేసేందుకు సంబంధిత అధికారుల […]

More