Close

News

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ “పశ్చిమగోదావరి జిల్లా” పర్యటన విజయవంతం చేయాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 26/12/2025

నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28వ తేదీ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా పెదమైనవానిలంకలో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 26/12/2025

వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు సహజ సిద్ధంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులు వాడాలి తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆలపాటి వెంగన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రాల ద్వారా వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉపయోగాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులను […]

More

వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మేలైన సేవలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.

Published on: 24/12/2025

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు, సేవలు విషయంలో వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రజలు ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు పూర్తి […]

More

నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/12/2025

పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు కీలకపాత్ర పోషించాలి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో […]

More

జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ కార్యక్రమాలను ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 23/12/2025

నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో కార్యశాల నిర్వహించి సుపరిపాలన ఏవిధంగా అందించాలో సప్త సూత్రాలను వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం […]

More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విచ్చేసే అతిధులకు, ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ విషయంలో ఏ విధమైన లోటుపాట్లకు తావులేని విధంగా అధికారులు వ్యవహరించాలి.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 23/12/2025

డిసెంబర్ 28న పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంకకు రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామమైన మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక గ్రామాన్ని ఈనెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించి పలు అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]

More

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 23/12/2025

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేయాలి. కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు అక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటను రెవిన్యూ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు. భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని రెవిన్యూ అధికారులతో పీజీ ఆర్ఎస్, 22 ఏ, ఐ వి ఆర్ ఎస్, రీ సర్వే, కోర్టు కేసులు, ముటేషన్, ఇళ్ల నిర్మాణం, తదితర […]

More

జిల్లాలో రబి సీజనుకు సరిపడినంత యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్ ఎస్ కె లు, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. రైతాంగం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

Published on: 23/12/2025

ఎంఆర్పీ ధర కన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. రైతులకు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తే పరిష్కార చర్యలు తీసుకుంటాం. యూరియా లభ్యత, ధరలు, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాలుపై గూగుల్ మీట్ ద్వారా జాయింట్ కలెక్టర్ రైతులతో ముఖాముఖి…… యూరియా సరఫరాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు.. ….జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ […]

More

అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు బుక్ చేయాలని తహసిల్దారుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 22/12/2025

ఆచంట నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం… ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.. గతంలో పట్టాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవ్… ఆచంట నియోజకవర్గం ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, నియోజవర్గం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పెనుగొండ మండలం […]

More

విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 22/12/2025

వీరవాసరం ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను ప్రారంభించారు. తొలుత మ్యాజికల్ సైన్స్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి నివాళులర్పించారు. అలాగే భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి […]

More