Close

News

ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 02/03/2026

శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి జాతరలు, వేడుకలు, దేవాలయాలు, ఆసుపత్రులు వద్ద పెద్ద శబ్దాలతో సౌండ్ సిస్టం వినియోగించరాదు, బాణాసంచా కాల్చరాదు. జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిaరం లో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శబ్ద, వాయు కాలుష్యం, ఏకీకృత కుటుంబ సర్వే, ఈ కేవైసీ, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతరలు, […]

More

పిజిఆర్ఎస్ లో అందిన ప్రతి వినతిని అధికారులు ఓర్పుతో చదివి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

Published on: 02/03/2026

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు… రెవెన్యూ క్లినిక్ లో 32 దరఖాస్తులు స్వీకరణ. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, […]

More

డిజిటల్ భవన్ లో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 28/02/2026

శనివారం పి.ఎం లంకలో జరిగిన పడవల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆమె డిజిటల్ భవన్‌ను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణలను స్వయంగా పరిశీలించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో చరవాణిలో స్వయంగా నేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ భవన్‌లో ఉచితంగా నాణ్యమైన కోర్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా […]

More

రామకృష్ణ మిషన్ వధాన్యత మత్స్యకార కుటుంబాలలో చిరస్థాయిగా నిలుస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 28/02/2026

మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద 100 మంది పేద మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 వేల విలువైన బోట్లు, వలలు పంపిణీ… జిల్లా కలెక్టర్ ఆలోచనతో రామకృష్ణ మిషన్ ఔదార్యంతో పేద మత్స్యకారి కుటుంబాలకు సమకూరిన బోట్లు, వలలు బోట్లు అందుకున్న కుటుంబాల కళ్ళలో ఆనందం అనిర్వచనీయం నేడు నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద రాజమండ్రి రామకృష్ణ మిషన్ […]

More

నరసాపురం పట్టణం 15వ వార్డులోని బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ…

Published on: 28/02/2026

ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అంతటా 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పింఛన్లు పంపిణీ …..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. నరసాపురం పట్టణం 15వ వార్డు మసీదు సెంటర్ వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు నేడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, […]

More

చిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో తాగునీటి కారణంగా ఒంటిపై దురదలు వచ్చాయి అనే సందేశం గురువారం రాత్రి అందిన వెంటనే వైద్య శాఖ అధికారును అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్..

Published on: 27/02/2026

రాత్రికి రాత్రే వైద్యాధికారులు ప్రతి ఒక్కరిని పరిశీలించి స్కిన్ ఎలర్జీ ఉన్న 54 మందిని గుర్తించి ఆయింట్మెంట్, టాబ్లెట్లు పంపిణీ. ప్రమాదకర పరిస్థితి లేదని ధ్రువీకరించిన వైద్యులు త్రాగునీటి కారణంగా స్కిన్ ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నవారు భయపడవలసిన అవసరం లేదు.. అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం త్రాగు నీటిని వెంటనే తనిఖీ చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు శుక్రవారం త్రాగునీటి సరఫరాను తనిఖీ చేసి పంచాయతీ సెక్రటరీకి స్వల్ప జాగ్రత్తలను తెలియజేసిన […]

More

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయుక్తంగా ఉండే యుఎఫ్ సర్వే పూర్తి చేయడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Published on: 27/02/2026

భీమవరం పట్టణంలో యుఎఫ్ సర్వే పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం ఒకరు విధులు గురించి మరొకరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. మనమందరం ప్రజలకు మేలైన సర్వీస్ లు అందించడానికి నియమించబడ్డాం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి రానున్న రెండు రోజుల్లో నూరు శాతం ఈఎఫ్ సర్వే, ఈకేవైసీ పూర్తి కాకపోతే చర్యలకు బద్దులు కావాల్సి ఉంటుంది మీ విభాగ అధిపతి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని హెచ్చరిక ….. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం మున్సిపల్ కార్యాలయాన్ని […]

More

వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ

Published on: 25/02/2026

హాస్టల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెనుగొండలోని వాసవి వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థినులకు అందుతున్న వసతులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ఆమె నిశితంగా సమీక్ష నిర్వహించారు. తనిఖీ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, విద్యార్థినులు నివసిస్తున్న గదులు, భోజనశాల, వంటగది, నిల్వ గదులు, త్రాగునీటి సదుపాయాలు […]

More

కేసుల విచారణను సంయుక్తంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 24/02/2026

నిషేదిత భూముల జాబితా – 22-ఎ కు దరఖాస్తులు విచారణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం నెలలో ప్రతి మంగళవారం (సెలవు దినాలు మినహా) 22-ఎ కేసుల విచారణ. నేడు విచారణకు చేపట్టిన 30 కేసులు.. మధ్యాహ్నం ప్రారంభించిన కేసులు విచారణ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]

More

ప్రతి సోమవారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/02/2026

జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న రెవిన్యూ క్లినిక్ లు.. 7 విడతలుగా 72 దరఖాస్తులు పరిష్కారం.. రెవెన్యూ క్లినికల్ ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతంగా జరుగుచున్నది.. రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు సత్ఫలితాలను నిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ తో పాటు సమాంతరంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ లను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. డిసెంబర్ 29,2025న రెవెన్యూ క్లినిక్ […]

More