Close

Press Release

Filter by:

పిల్లలందరూ, మరి ముఖ్యంగా బాలికలు అందరూ మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల నందే స్వీకరించాలి

Published on: 18/02/2026

విస్సాకోడేరు జడ్పీ స్కూల్ నందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్.. ప్రభుత్వం మంచి పోషక విలువలతో కూడిన మెనూతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నదని తల్లిదండ్రులు, విద్యార్థులు గ్రహించాలి విద్యార్థులు పాఠశాల నుందే మధ్యాహ్నం భోజనం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చినప్పుడే చదువులో రాణింపు ఉంటుందని హితువు నేడు అధికారులందరూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మూకుమ్మడి తనిఖీలు.. తరచూ అధికారులు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనం […]

More

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 17/02/2026

జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత తీసుకుంటుంది అన్నారు. విద్యార్థులతో […]

More

వసతి గృహాలలోని విద్యార్థిని, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 17/02/2026

పదవ తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులు కష్టపడి చదివి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి. మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు […]

More

ఉండి నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధిలో ముందంజలో నిలిచి రాష్ట్రానికి దిక్సూచిగా నిలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు

Published on: 16/02/2026

రతన్ టాటా మార్గ్ పెదఅమిరం గ్రామ పరిధిలో కాళ్ల మండలం పెదమిరం ఉండి ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో రూ.1.50 కోట్లతో విస్తరించే నాలుగు లైన్ల రహదారి పనులకు సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. […]

More

ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు నూరు శాతం రాయితో పీఎం సూర్య ఘర్ సోలార్ ప్యానల్స్ అమరిక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Published on: 16/02/2026

ఎస్సీ/ ఎస్టీ గృహాలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెలుగులు ఎస్సీ, ఎస్టీ గృహాలకు నూరు శాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అమరిక ఒక్కొక్క కుటుంబానికి నూరు శాతం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు రూ.1.20 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.60 వేలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పథకం అమలుకు ఏప్రిల్ 13, 2026 ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలలో విద్యుత్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం […]

More

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 16/02/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 240 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 67 దరఖాస్తులు స్వీకరణ. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణరెడ్డి, […]

More

సాంఘిక శాస్త్రంలో కష్టమైన అంశాలను స్వయంగా బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 14/02/2026

భీమవరం పి ఎస్ ఎం బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన పదవ తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని కష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, విధులు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు […]

More

గ్యాస్, ఆయిల్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంపొందించాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 14/02/2026

భీమవరం పట్టణంలో శనివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్, ఆయిల్ వినియోగంపై నిర్వహించిన అవగాహన వాహనాన్ని, ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులు అయిన గ్యాస్, ఆయిల్ ను ప్రజలందరూ పొదుపుగా వాడాలని, ప్రత్యామ్నాయ వనరులైన ఎలక్ట్రికల్ వాహానాలు, సోలార్ వస్తువులు, పర్యావరణ హితమైన బయో ఆయిల్ ఉత్పత్తుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. […]

More

భక్తులు సేవే భగవంతుని సేవగా భావించాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 14/02/2026

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలన, అధికారులతో సమీక్ష ఆలయ పరిసరాలు సుందరంగా కనిపించాలి ఆలయానికి కిలోమీటరు దూరం వరకు ఆధ్యాత్మిక భావం కనిపించేలా ఏర్పాటు చేయాలి దాతలు ఇచ్చిన ప్రసాదాలు, అన్నదానం భక్తులు స్వీకరించేందుకు తగిన ఏర్పాటు చేయాలి అధికారులు ఆదేశాలు పంచారామ క్షేత్రాలు ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ప్రసిద్ధి చెందిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి శివరాత్రి […]

More

సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 14/02/2026

దామోదరం సంజీవయ్య 105వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దామోదరం సంజీవయ్య చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు దామోదరం సంజీవయ్య అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అట్టడుగు వర్గాల […]

More