Close

Press Release

Filter by:

జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 21/02/2026

భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సర్వే, వైద్య, వ్యవసాయ, విద్య, పంచాయతీరాజ్, ఐ సి డి ఎస్, ఉద్యానవన శాఖల అధికారులతో సమావేశమై కేంద్రం జిల్లాకు కేటాయించిన ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. తొలుత ఏ ఏ శాఖలలో ఏ ఏ పథకాల కింద ఎంత నిధులు మంజూరయ్యాయి, వాటిని ఎంతవరకు ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయాలి, ఏ ఏ పనులు ప్రోగ్రెస్ లో ఉన్నవి […]

More

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేగిరాజు శివ వర్మ చేస్తున్న ప్రాతళ్ళమెరక అభివృద్ధి అభినందనీయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

Published on: 21/02/2026

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ 30వ వార్షిక వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న అభివృద్ధి పథంలో ప్రాతళ్ళమెరక కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, మైక్రో ఫిల్టర్, మంచినీటి పైపులైను, సీసీ కెమెరా సిస్టం ఏర్పాటును, సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో గ్రామ మురుగునీటిపారుదల కోసం చేసిన డ్రైనేజ్ సిస్టంను, సుమారు రూ.50 లక్షల వ్యయంతో చినపేట మంచినీటి చెరువు సంరక్షణ కొరకు కట్టిన వాల్, వాకింగ్ ట్రాక్, […]

More

పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చెత్త నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 21/02/2026

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం నందు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛ రథాన్ని ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. గృహాలలో పనికిరాని ప్లాస్టిక్, ఇనప వస్తువులు, పుస్తకాలు, పేపర్లు, తదితర వస్తువులను ఈ వాహనం ద్వారా అమ్మితే వాటి విలువకు […]

More

జనాభా లెక్కల సేకరణ-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో వెల్లడి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/02/2026

తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ డిజిటల్ విధానంలో …. అందుకు అనుగుణంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్ … ఖచ్చితమైన వివరాలతో కూడిన జనాభా లెక్కల సేకరణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తాం… జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు అయిన జిల్లా కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రత్యేక […]

More

సేవ భావంతో విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 20/02/2026

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీ ఆర్ఎస్ లో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి తొలిసారిగా ప్రత్యేకంగా నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, డిఎంహెచ్ఓ జి.గీతా బాయి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్ అప్పారావు, డిఆర్డిఏ […]

More

ఎంపీడీవోలు, తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 19/02/2026

ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేసి ఈ వారాంతానికి నూరు శాతం ప్రగతి సాధించాలి. ఈ కేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ అంశాలపై ఎంపీడీవోలు, తహసిల్దారులు సంబంధిత అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేసి ఈ వారాంతానికి […]

More

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓ లను ఆదేశించారు.

Published on: 18/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్, ఫారం 6,7,8 క్లైమ్ల పరిష్కారం, యువ ఓటర్ల నమోదు ప్రచారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమాధానం ఇస్తూ బిఎల్వోలు ఫీల్డ్ వెరిఫికేషన్ కి వెళ్ళిన సందర్భంలో ఐడెంటి కార్డును తప్పనిసరిగా ధరించాలన్నారు. వివిధ […]

More

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 18/02/2026

మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి ఫలితాలను సాధించాలి. భీమవరం పట్టణంలో ఏ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. కిచెన్ రూమ్ లో […]

More

మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు.

Published on: 18/02/2026

మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణ. జిల్లాలో 132 కేంద్రాల్లో 24,166 మంది పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థిని, విద్యార్ధులు. ……జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో 10 తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం విద్యాశాఖ, ఇంటర్మీడియట్, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరగనున్న 10 […]

More

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Published on: 18/02/2026

పశువులు రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయి.. పాడి, పసుపు నానుడికి అర్థంగా ప్రతి ఒక్క రైతు కనీసం ఒక ఆవు, గేదె పెంచాలి.. పశ్చిమగోదావరి జిల్లాలో నానాటికి తరిగిపోతున్న పశుసంపదను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పశువులు కలిగి ఉంటే అన్ని కాలాల్లో ఆదాయం ఉన్నట్టే పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ మరియు అగర్తిపాలెంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ […]

More