Close

Press Release

Filter:

విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల మోటార్ వాహనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 06/11/2025

శారీరక వైకల్యం కలిగిన వారు మేరకు మూడు చక్రముల మోటార్ వాహనాలకై www.apdascac.ap.gov.in ఆన్ లైన్ ద్వారా నిబంధన మేరకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి దరఖాస్తును నవంబర్ 25 లోపుగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయము నందు అందజేయాలన్నారు. దరఖాస్తుదారుని వయసు నవంబర్ 25,2025 నాటికి 18 నుండి 45 సంవత్సరముల మధ్య ఉండాలన్నారు. శారీరక వైకల్యం ఒకటి లేదా […]

More

డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ఆహార పదార్థాలను రుచిచూసిన జిల్లా కలెక్టర్..

Published on: 06/11/2025

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాలను రుచి చూసిన మండల ప్రత్యేక అధికారులు… గురువారం మెనూ ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఆహార పదార్థాలు వడ్డింపు… మధ్యాహ్న భోజనాన్ని ఉత్సాహంగా స్వీకరిస్తున్న విద్యార్థులు.. మెనూ మార్చిన తర్వాత ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయని పిల్లల మనోభావం… నాణ్యమైన గుడ్డులను ఇస్తున్నట్లు తెలిపిన విద్యార్థులు.. … పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. విద్యార్థులు సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం […]

More

జిల్లాలో మాతృ, శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన మాతృ మరణాలు, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత సమావేశంలో సమీక్షించిన సందర్భంలో మాతృ, శిశు మరణాలకు కారణమైన కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ పై […]

More

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నాగరిక సమాజంలో ఆడ, మగ తారుతమ్యం లేదని అన్నారు. పురుషుల కంటే దీటుగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు. అనాగరికమైన గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించుకున్న ఉపేక్షించేది లేదని, […]

More

రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ సీజన్ కొనుగోలు కేంద్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభం..

Published on: 03/11/2025

గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు.. కౌలు రైతులకు నూరు శాతం సబ్సిడీపై 50వేల తార్పలిన్లు ఉచితంగా అందజేస్తాం.. కౌలు రైతును ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం.. గన్ని బ్యాగులు ఎక్కడ కొరత లేకుండా అధికారులు చూడాలి.. ధాన్యం మిల్లుల తరలింపుకు 36 వేల వాహనాలను ఏర్పాటు చేశాం ఫిర్యాదుకు 1967 కాల్ చేయాలి, 7337359375 నెంబర్ వాట్సప్ లో హాయ్ పెట్టి మీకు నచ్చిన తేదీ, సమయంలో […]

More

దీర్ఘకాలంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించని ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్లు పునరుద్ధరణ లేదా నగదు వాపస్ తీసుకోవడానికి ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 03/11/2025

మీ డబ్బు…. మీ హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎల్ డి ఎం నాగేంద్రప్రసాద్, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి చేతుల మీదగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ఆఫీస్ ఖాతాలలో నిరుపయోగంగా ఉన్న డిపాజిట్లు, ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించిందన్నారు. లీడ్ బ్యాంకు ద్వారా ప్రజలలో అవగాహన […]

More

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/11/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎం.రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 232 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా […]

More

నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు–ప్రత్యేకంగా అభినందించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/11/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు వచ్చినందుకు పూల మొక్కను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేక ఆపరేషన్, దర్యాప్తు మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో 2025 సంవత్సరానికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా “కేంద్రీయ గృహమంత్రి […]

More

పశ్చిమగోదావరి జిల్లాలోని నలుగురు ఉద్యోగులు మొంథా తుఫాన్ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక…

Published on: 03/11/2025

రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేత.. ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. మొంథా తుఫాన్ సమయంలో సంసిద్ధత, సహాయ కార్యకలాపాలలో అంకితభావం, నాయకత్వం, అవిశ్రాంత కృషికి గుర్తింపుగా రాష్ట్రస్థాయి ఎంపికలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నవంబర్ ఒకటిన విజయవాడలో అవార్డుల ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా […]

More

జిల్లాలో 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు సామాజిక పింఛన్ల పంపిణీ..

Published on: 01/11/2025

సామాజిక పింఛన్లు వృద్ధులకు వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు శనివారం భీమవరం పట్టణం 19వ వార్డు భీమేశ్వర స్వామి ఆలయం పక్క వీధిలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అభయ హస్తం, దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు 19వ వార్డులోని మొత్తం 246 […]

More