సమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.
Published on: 23/09/2025మంగళవారం విస్సకోడేరు గ్రామ సచివాలయం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సమిత్వ సర్వేపై ఆరా తీస్తూ రికార్డులను పరిశీలించారు. ఎన్ని పీపీఎంలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి, మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధానాలను పాటిస్తున్నారని ప్రశ్నించారు. విస్సకోడేరు గ్రామంలో స్వయంగా ఒక పిపిఎంను పరిశీలించారు. అలాగే స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టర్ ను స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పన్నులను వసూలు చేస్తున్నారా, పెండింగ్ ఏమైనా ఉన్నాయా, డిమాండ్లు […]
Moreఅంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/09/2025మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అంగనవాడి కేంద్రాల ద్వారా సమతుల్య పౌష్టికాహారం అందించాలి. మంగళవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో టేక్ హోమ్ రేషన్, బాలామృతం, ప్రీస్కూల్ హాజరు, బాల్య వివాహాలు, గర్భిణీ స్త్రీల, బాలింతల, పిల్లల ఆరోగ్య అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా […]
Moreఆక్వాజోనైజేషన్ నిర్ధారణలో నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 22/09/2025సోమవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం, పెంటపాడు, గణపవరం మండలాల ఎఫ్ డి ఓ లు, ఎం ఏ ఓ లు తో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 19న నిర్వహించిన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీలో ఆమోదించిన 31,307.4 ఎకరాల విస్తీర్ణంతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 1,32,562.9 […]
Moreజిల్లా వ్యాప్తంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను వర్మీ కంపోస్ట్ గా తయారీకి చర్యలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 22/09/2025రొయ్యల చెరువులలో వర్మీ కంపోస్ట్ ను వాడి అధిక దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వర్మీ కంపోస్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించి, ప్రారంభించారు. అనంతరం కిలో ఒక్కింటికి రూ.10/- చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన రైతులకు 4.5 టన్నుల వర్మీ కంపోస్ట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ […]
Moreస్త్రీనిధి రుణాలు పారదర్శక చెల్లింపులకు బయోమెట్రిక్ డివైజ్ లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 22/09/2025సోమవారం భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా గ్రామ సంఘాల సభ్యులకు బయోమెట్రిక్ డివైజ్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం సుమారు 220 కోట్ల రూపాయలను స్త్రీ నిధి రుణాలుగా అందజేయడం […]
Moreజిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుండి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
Published on: 22/09/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈసందర్బంగా వివిధ సమస్యల […]
Moreచేకూరి రామబద్రిరాజు దాతృత్వంతో భీమవరం పాత బస్టాండ్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అయిందని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు.
Published on: 22/09/2025చేకూరి రామబద్రిరాజు, పార్వతి దంపతుల ఆర్థిక సహకారముతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణములో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తొలుత నూతన ఆర్టిసి కాంప్లెక్స్ లో శాస్త్రోక్తతంగా పూజలు […]
Moreపరిశుభ్రమైన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడానికి ప్రజలు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 20/09/2025స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు ఆదిత్య కాలనీ యుహెచ్సి ఎదురుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలకు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను ఏర్పాటు చేసి, తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతీనెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, మొక్కలను నాటడం తదితర పర్యావరణ […]
Moreసముద్ర తీర ప్రాంత పర్యావరణ సమతుల్యతతో జల, చర ప్రాణులను కాపాడుకుందాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు
Published on: 20/09/2025జల, చర ప్రాణుల సంరక్షణలో సముద్ర తీర ప్రాంత సమతుల్యతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి . సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ నందు బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా, మెప్మా మహిళలు, పరిశ్రమంల ప్రతినిధులు, అధికారులు, తదితరులతో కలిసి బీచ్ క్లీనింగ్ నందు […]
Moreరేపు శనివారం పేరుపాలెం బీచ్లో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 19/09/2025జాతీయ తీరప్రాంత మిషన్ పథకం క్రింద కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని తీరప్రాంత రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సహకారంతో సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని నిర్వహించడానికి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ని గుర్తించడం జరిగిందని, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 20 ఉదయం పేరుపాలెం బీచ్ […]
More