Close

Press Release

Filter by:

వికసిత్ భారత్ సంకల్పంలో ప్రతి శ్రామికుడు భాగస్వామి కావాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

Published on: 31/01/2026

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో ఉపాధిహామీ కూలీలతో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. విబిజి రామ్ జీ (VBG RAM G) పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – పథకం అమలులో పారదర్శకతే మోదీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశాభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రతి కూలీని భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ […]

More

కలెక్టరేట్ మార్గంలో ఏర్పాటుచేసిన సోలార్ లైట్లు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Published on: 31/01/2026

రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నది… భవ్య భీమవరంలో భాగంగా విస్సాకోడేరు వంతెన నుండి కాలువ గట్టు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం వరకు, తిరుమల కళాశాల నుండి భారతీయ విద్యా భవన్ వరకు భీమవరం పురపాలక సంఘం, సోలార్ వెoడర్స్ సౌజన్యంతో రూ.14.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 వాట్స్ సామర్థ్యం కలిగిన 63 సౌర వీధి దీపాలను కముజువారిపాలెం నందు […]

More

భీమవరంలో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్…

Published on: 31/01/2026

లబ్ధిదారులను ఆప్యాయతగా పలకరిస్తూ మాటామంతి … రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి… రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. భీమవరం పట్నం 6వ వార్డు బొక్కావారిపాలెంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ […]

More

అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 30/01/2026

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 10 నాటికి నూరు శాతం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణాల ప్రగతి, ఇపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్య శాఖ అధికారులు, ఎఫ్ డి ఓ లు, ఎండి వోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,31,436 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 66,340ఎకరాలు […]

More

జనవరి 31న నిర్వహించనున్న డి.ఆర్.సి సమావేశానికి అన్ని అంశాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 29/01/2026

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీఆర్సీ) ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డిఆర్సి సమావేశాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు […]

More

జిల్లా అధికారులు ప్రతి అంశంలో జిల్లాను ముందంజలో ఉండేలా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/01/2026

జిల్లాలో పట్టణ, గ్రామీణ వైద్య సేవలు భేష్.. రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం… యూరియా అందుబాటు, ధర, రవాణా శాఖ పన్నులు వసూలు, రెవిన్యూ సర్వీస్ లలో మొదటి మూడు స్థానాలు .. ప్రజా స్పందన నివేదికలో వెల్లడి… రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ […]

More

జిల్లా ఆసుపత్రి తణుకులో దశలవారీగా అన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తణుకు నియోజవర్గం శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.

Published on: 29/01/2026

జిల్లా ఆసుపత్రి, తణుకు నందు బ్లడ్ సెంటర్, హీమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ విభాగములనుతణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా.పగడాల సూర్యనారాయణ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న హీమోఫీలియా వైద్యాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తిగా […]

More

పట్టాదారు పాసు పుస్తకాలు రైతుకు ఒకసారి అందజేసిన తరువాత మరల తప్పులు పునరావృతం కాకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 29/01/2026

క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ప్రతి పట్టాదారు పాసుపుస్తకంను రైతుకు అందజేసే ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి అందజేయాలని, ఒకసారి అందజేసిన తర్వాత తప్పులు ఎట్టి పరిస్థితుల్లో పునరావతం కాకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధింత అధికారులు ఆదేశించారు. ఇరగవరం మండలం కoతేరు గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]

More

జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/01/2026

మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలలో భాగంగా “స్పర్శ” లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడి వర్కర్లు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజలకు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల […]

More

రానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 గృహాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 29/01/2026

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించేందుకు 9,135 గృహ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా […]

More