Close

Press Release

Filter by:

కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Published on: 26/01/2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఆకట్టుకున్న వివిధ శాఖల అభివృద్ధి శకటాలు, స్టాల్స్. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మడ్ రిజర్వు, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్.టి.ఎఫ్ కాంటింజెంట్, విమెన్ […]

More

యువ ఓటర్లు మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనతో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 25/01/2026

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 16 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు […]

More

జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 25/01/2026

జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ కె.విజయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ ఎంపిక చేసిన “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు – 2025” ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్, రాష్ట్ర […]

More

రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమన్వయంతో పనిచేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/01/2026

భీమవరం ఆర్డీవో కార్యాలయంలో శనివారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై డివిజన్లోని తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు, సచివాలయ సిబ్బందితో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో […]

More

చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/01/2026

జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసేందుకు వారిని మానసికంగా సంసిద్ధం చేయాలి. వచ్చే మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా వందరోజుల కార్యాచరణపై డిప్యూటీ ఎంఈఓ, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు, ఒకేషనల్ టీచర్లతో శనివారం ఉండి జిల్లా పరిషత్ పాఠశాల స్వామి వివేకానంద సమావేశ మందిరం […]

More

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/01/2026

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. రహదారి భద్రత… మన అందరి బాధ్యత. జాతీయ రహదారి భద్రత మహోత్సవం 2026 సందర్భంగా శనివారం భీమవరం పాత బస్టాండ్ వద్ద నుండి జిల్లా రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, వివిధ కళాశాలల వాహనాల డ్రైవర్లు, ప్రజలతో నిర్వహించిన వాక్ థాన్ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ […]

More

నేడు మహిళలు వ్యాపారవేత్తలుగా అడుగులు వేశారు అంటే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుకు ఆనాడు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణం..

Published on: 24/01/2026

మహిళలు తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా సమాజ సేవే … నాగరిక సమాజంలో బహిరంగ మల, మూత్ర విసర్జన మానుకోవాలి… ముఖ్యంగా పురుషులు బహిరంగ మూత్రవిసర్జన మానుకోవాలి… మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆలోచన చేయాలి బహిరంగ మల మూత్ర విసర్జన కారణంగా భూమి, నీరు, గాలి కలుషితమై అనేక రోగాలకు కారణం అవుతున్నాయి మోసాలకు గురి కాకుండా మహిళలు అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి.. మహిళలు స్వసక్తితో ఎదగాలని ఆలోచన చేసి […]

More

ఫేజ్ -1,2,3 రీ సర్వేకు సంబంధించి రైతుల పూర్తి సమాచారాన్ని సత్వరమే వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలి–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 23/01/2026

ఫిబ్రవరి 2 నుండి 9 వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఆక్వా రైతుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్స్, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రీ సర్వే అంశాలపై ఆర్డీవోలు, తహాసిల్దార్లు, ఎఫ్.డి.ఓలు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ […]

More

రానున్న వర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో అవసరమైన ఇసుక నిల్వలను ముందస్తు సిద్ధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 23/01/2026

జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం సంబంధిత కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి, సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఎండిఎల్ పాయింట్స్ […]

More

జిల్లాలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఫిర్యాదులు అందితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 23/01/2026

భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను అంతా పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మాత్రం మధ్యాహ్నం భోజనంలో అన్నం సరిగ్గా ఉడకడం లేదని […]

More