Close

Press Release

Filter:

జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులు అందరూ తప్పనిసరిగా సిఐఐఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 16/10/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగు రైతులతో, మత్స్యశాఖ అధికారులతో సమావేశమై సిఐఐఏ రిజిస్ట్రేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్ వాటర్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం సిఐఐఎ కింద మంజూరు చేసే ప్రయోజనాలను పొందడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లాలో […]

More

జిల్లాలో పేదల గృహాలు నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ బాబు అన్నారు.

Published on: 16/10/2025

గురువారం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం లే అవుట్ ను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన గృహా నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి అవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకాల కింద పేదల కోసం 56,210 గృహాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 35,970 గృహాలను పూర్తి చేయడం జరిగిందని, […]

More

సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ పై అవగాహ వాహన ర్యాలీ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 16/10/2025

జీఎస్టీ తగ్గింపుతో ఆటో మొబైల్ రంగంలో ప్రజలకు మేలు సూపర్ జీఎస్టీ…సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలో ప్రజలకు చేకూరిన ప్రయోజనాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వాహనాలపై భారీ మొత్తంలో జిఎస్టి తగ్గింపు కారణంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం భీమవరం లూథర్న్ హై స్కూల్ గ్రౌండ్ నుండి వాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ […]

More

అమృతతుల్యమైన రక్తాన్ని దానం ఇవ్వడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు

Published on: 15/10/2025

బుధవారం పశ్చిమ గోదావరి శాఖ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన సి.పి.ఆర్ అవగాహన వారోత్సవం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా సిపిఆర్ ప్రక్రియను చేసి చూపించారు. అనంతరం రక్తదాతలతో మాట్లాడి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రాణరక్షణకు ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ […]

More

బాలికలు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించినప్పుడే కుటుంబం, సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 15/10/2025

బాలికలు ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనండి… సాధన చేయండి …ఉన్నత శిఖరాలు అధిరోహించండి. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం తిరుమల కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు. చదువుకునే దశలో బాలికలు పౌష్టికాహారం […]

More

ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న కన్నతల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదు..

Published on: 15/10/2025

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం స్కూల్లో ఓనమాలు నేర్చి నేడు కేరళ డీజీపీగా పనిచేస్తున్న… నా తల్లిదండ్రులు, గురువులు మార్గదర్శకత్వం, స్నేహితులు ప్రేమ నన్ను ఉన్నతంగా నిలిపాయి అనడంలో సందేహం లేదు… జీవితంలో అత్యున్నతమైనది “కృతజ్ఞత” …. దానగుణం ఔన్నత్యానికి, వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయి.. విద్యార్థులు సోషల్ మీడియా మాయలో జీవితానికి అడ్డంకులు ఏర్పరచుకోవద్దు.. మాదకద్రవ్యాలు సవాలు నుండి మన చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది… .. కేరళ రాష్ట్ర డిజిపి రావాడ ఆజాద్ […]

More

అక్టోబర్ 14 నుండి ఘనంగా ప్రారంభమైన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్

Published on: 14/10/2025

ప్రదర్శనను తిలకించిన రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జువ్వలపాలెం రోడ్ లోని కాస్మాపాలిటన్ క్లబ్ నందు భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తున్న జీఎస్టీ ఫలాల ప్రచారాన్ని జన బహుళ్యoలోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు జువ్వలపాలెం రోడ్డులోని కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ ను […]

More

“భీమవరం అక్టోబర్ 14 నుండి సూపర్ జిఎస్టి బెన్ఫిట్ బజార్”–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 13/10/2025

సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 14న జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించవలసిన ప్రత్యేక కార్యక్రమాలు, “భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ ” నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ చాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

జీఎస్టీ అవగాహన ప్రచారంలో భాగంగా స్వదేశీ వస్తువులను ప్రజలు విరివిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు

Published on: 13/10/2025

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో మూడవ వారం చివరి రోజున ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలు, ఎం ఎస్ ఎం ఈ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎస్ హెచ్ జి మహిళల ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా తిలకించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చెక్కతో తయారు చేసిన హస్తకళల […]

More

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/10/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు […]

More