యువత దేశానికి దిశా నిర్దేశమని, అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి సురక్షితమైన వాహన చోదన ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 06/12/2025శనివారం బివి రాజు కూడలి నుండి ఏర్పాటుచేసిన ట్రాఫిక్ పై అవగాహన త్రీ కే రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు, ప్రజలు, అథ్లెటిక్స్, వాకర్స్ అసోసియేషన్స్ పాల్గొని త్రీ కే రన్ ను జువ్వలపాలెం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు […]
Moreఆర్థిక కారణాలతో చదువుని కొనసాగించలేని వారికి *”సరస్వతీ విద్యా నిధి” ద్వారా సహకారం… నేడు సభా వేదిక నుండి ప్రకటన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 05/12/2025తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విద్యార్థుల భవిష్యత్ కి ఒక చక్కని దిశా నిర్దేశం .. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మార్గ నిర్దేశంగా పిటిఎం దోహదపడుతుంది విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. శుక్రవారం భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.O కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో […]
Moreజిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలపై తక్షణమే నివేదిక అందించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/12/2025ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు అధ్యయనం చేసి ఫిర్యాదు దారు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి గురువారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిజిఆర్ఎస్, రీ సర్వే, ఇళ్ల స్థలాలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, రెవెన్యూ అంశాల ప్రగతిపై, డిఆర్ఓ, ఆర్డీవోలు, తహసిల్దార్లు, సర్వేయర్లుతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ […]
Moreపంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 04/12/2025గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మొత్తం 77 డిడిఓ కార్యాలయాలయ భవనాలను లాంచనంగా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలంలోని విస్సా కోడెరు గ్రామంలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, భీమవరం ఆర్డీవో […]
Moreజిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 04/12/2025గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ […]
Moreఅన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యత, వసతులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/12/2025అన్న క్యాంటీన్ లో ఆహారం నాణ్యతతో కూడి, పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలి… గురువారం నరసాపురం స్టీమర్ రోడ్ లో ఉన్న అన్న క్యాంటీన్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నా క్యాంటీన్లో నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతులును పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు, పలు సూచనలు ఇచ్చారు. స్వయంగా లబ్ధిదారులకు భోజనమును వడ్డించారు. స్వయంగా […]
Moreమాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 03/12/2025బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టరు, స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించి సాయుధ దళాల పతాకనిదికి తమ మొదటి విరాళం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భారత సైనికదళాల దేశభక్తి, సాహసము, త్యాగాల పట్ల దేశం గర్విస్తున్నదన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, దేశ సరిహద్దులు, వెలుపల మన సైనికుల […]
Moreబాగా చదివిన వారికే రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు వస్తాయని, కష్టపడి, అర్థం చేసుకుని చదివి, జీవితంలో క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు
Published on: 03/12/2025పెనుగొండ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ఆచంట పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు ఎవరన్నా రక్తహీనతతో ఉన్నారా, డ్రింకింగ్ వాటర్ ఏం ఉపయోగిస్తున్నారు, పిల్లల చిక్కి తింటున్నారా, పిల్లలకి ఏం మెనూ ఇస్తున్నారు, హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా, ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయా, డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నారా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ను పిల్లలకి అందజేశారా, దుప్పట్లు అందరికీ ఉన్నాయా, వంట వాళ్ళు పరిశుభ్రంగా […]
Moreపశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నానాటికి పెరుగుచున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు “ట్రాఫిక్ ఫ్రీ” గా కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 02/12/2025ట్రాఫిక్ అడ్డంకుల నియంత్రణలో జిల్లా ప్రజలు, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలి… పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీగా చేసుకోవడం మన అందరి బాధ్యత.. దండించి, భయపెట్టి ఆలోచన జిల్లా యంత్రాంగానికి, పోలీస్ శాఖకు లేదు.. ప్రజల స్వచ్ఛందంగా అవగాహన కలిగి మెలగాలి ట్రాఫిక్ అవరోధాలను నిరోధించేందుకు రెవిన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, తదితర శాఖలతో ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు.. ఎన్ఫోర్స్మెంట్ టీములు ట్రాఫిక్ అవరోధాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలి మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ […]
Moreభారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 01/12/2025భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాక్ అసెంబ్లీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులుగా అద్భుత ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థిని, విద్యార్థులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నుండి ఏడు నియోజకవర్గాల నుండి ఒక్కొక్క విద్యార్థి ప్రజాప్రతినిధిగా హాజరై అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా […]
More