Press Release
ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరుపట్టిని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/06/2025పట్టణంలో ఏ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజన పథకం మెనూ వివరాలపై ఆరా విద్యార్థులు వినియోగించే టాయిలెట్ పరిశీలన భీమవరం పట్టణం నాలుగువ వార్డులో ఉన్న అల్లూరి రామకృష్ణ రాజు మున్సిపల్ హై స్కూల్ (ఏ ఆర్ కె ఆర్) శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వండి పెట్టే కిచెన్ రూమ్ […]
భీమవరం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Published on: 27/06/2025శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం, పారిశుధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, రోడ్ల ఆక్రమణల తొలగింపు, తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవ్య భీమవరం ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో దాతల సహకారంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభం […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 11 00 కాల్ సెంటర్ కు అందిన అర్జీల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి … జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 27/06/2025ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ అందిన అర్జీల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవిన్యూ, పంచాయతీ, సర్వే, మున్సిపల్, వైద్యశాఖ, ఎలక్ట్రిసిటీ, కోపరేటివ్, గృహ నిర్మాణం, సివిల్ సప్లై, ఇరిగేషన్, స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంచాలి* –జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 27/06/2025డ్రగ్స్ రహిత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను తీర్చిదిద్దుదాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బగా భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి, అడిషనల్ ఎస్పీ కే.భీమారావు, రాష్ట్ర ఏపీఐఐసీ […]
జాయింట్ ఎల్.పి.ఎంలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు
Published on: 26/06/2025గురువారం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో జాయింట్ ఎల్.పి.ఎంలు పట్టాదారులుగా నమోదైన భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో జాయింట్ ఎల్.పి.ఎంలు ఎన్ని ఉన్నాయి, వాటి మీద తీసుకున్న చర్యలు గురించి సంబంధిత అధికారులను వివరాల అడిగి తెలుసుకున్నారు. గరగపర్రు గ్రామంలో 439 జాయింట్ ఎ.ఎల్.పి.ఎంలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ […]
25 మంది టీబి రోగులను దత్తత తీసుకొని పౌష్టికాహారం అందించేందుకు ముందుకు వచ్చిన పశ్చిమ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని రోల్ మోడల్ గా తీసుకోవాలి….సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ హెల్త్ సెక్రటరీ
Published on: 26/06/2025ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీబీ డివిజన్ హెల్త్ అడిషనల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. . కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి. గీతాబాయి, జిల్లా టిబి, లెప్రసి మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ కె.రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ […]
పశ్చిమగోదావరి జిల్లాకు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గా జులై 2022 నుండి 2025 వరకు మూడు సంవత్సరములు అత్యుత్తమ సేవలు అందించి వరుసగా ఆరుసార్లు అవార్డులు అందుకొని డబల్ హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించిన శ్రీ టి శివరామ ప్రసాద్ ఇటీవలే కృష్ణాజిల్లాకు బదిలీ అయిన సందర్భముగా ఆయనను సత్కరించుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పౌరసరఫరాల సిబ్బంది సభ ఏర్పాటు చేయడం జరిగింది.
Published on: 26/06/2025ఈ సభకు ముఖ్యఅతిథగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరు అయ్యారు. అలానే ఈ సభలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల సిబ్బంది, మరియు రైస్ మిల్లర్లు తదితరులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ వారు మరియు ఇతర జిల్లా మరియు మండల స్థాయి అధికారులు ఈ మూడేళ్లలో టి.శివరామ ప్రసాద్ తో వారికి కలిగిన అనుభవాలను అందరితో […]
స్వయం సహాయక సంఘాల సభ్యులు నూతన ఆలోచనలు చేసి కొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 26/06/2025బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంటర్ పెన్యూర్ యాక్షన్ ప్లాన్ (EAP) అమలుపై మెప్మా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యానికి అనువైన యూనిట్ల స్థాపించి ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. నూతన ఆలోచనలతో మార్కెట్ […]
పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల సర్వేలను ఆదేశించారు
Published on: 25/06/2025జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పి జి ఆర్ ఎస్ లో వచ్చిన దరఖాస్తులు పెండింగ్, జాయింట్ ఎల్ పి ఎం ఎస్ సంబంధించిన పురోగతిపై బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి, డివిజన్ మరియు మండల సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 25/06/2025భీమవరం ఆర్ ఆర్ డి ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (Apssdc) మరియు నేషనల్ కెరియర్ సర్వీస్ (NCS) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూత్ ఫర్ జాబ్ ఫౌండేషన్, రెడ్డి ఫౌండేషన్ వారు ఈ ఉద్యోగ మేళాలో […]