Close

పశ్చిమగోదావరి జిల్లాకు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గా జులై 2022 నుండి 2025 వరకు మూడు సంవత్సరములు అత్యుత్తమ సేవలు అందించి వరుసగా ఆరుసార్లు అవార్డులు అందుకొని డబల్ హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించిన శ్రీ టి శివరామ ప్రసాద్ ఇటీవలే కృష్ణాజిల్లాకు బదిలీ అయిన సందర్భముగా ఆయనను సత్కరించుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పౌరసరఫరాల సిబ్బంది సభ ఏర్పాటు చేయడం జరిగింది.

Publish Date : 26/06/2025

ఈ సభకు ముఖ్యఅతిథగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరు అయ్యారు. అలానే ఈ సభలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల సిబ్బంది, మరియు రైస్ మిల్లర్లు తదితరులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ వారు మరియు ఇతర జిల్లా మరియు మండల స్థాయి అధికారులు ఈ మూడేళ్లలో టి.శివరామ ప్రసాద్ తో వారికి కలిగిన అనుభవాలను అందరితో పంచుకోవడం జరిగినది.

ప్రస్తుత జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ జిల్లాకు నియమితులైనప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే వారికి ఫోన్ చేసి సంప్రదించినట్టు తెలిపారు
అందులో శివరామ ప్రసాద్ ఒకరు అని తెలియజేశారు. వారు మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను అని ఫోన్ కాల్ లో అన్నారు అని తెలియజేశారు. అలానే ఆయన చెప్పినట్టుగానే ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయ పరుచుకుంటూ నేను ఇచ్చే ఆదేశాలను అందరికీ తెలియపరుస్తూ ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుమతి పశ్చిమగోదావరి జిల్లా అయినప్పటికీ ఎటువంటి అవంతరాలు లేకుండా విజయవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అలానే ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద చౌక ధర దుకాణాల వద్ద అందుబాటులో ఉంచవలసిన నిత్యవసర సరుకులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇచ్చిన కాల పరిమితిలోనే వాటిని అక్కడ అందుబాటులో ఉంచేవారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నందు కూడా జిల్లాను ఎప్పుడూ రాష్ట్రంలోనే మొదటి మూడు స్థానాలలోనే నిలబెట్టేవారు. అంతేకాకుండా జిల్లా జాయింట్ కలెక్టర్ వారు టీ శివరామ ప్రసాద్ గారు చాలా పోటీ తత్వము కలిగిన మనిషి అని కొనియాడారు. ఈమధ్య డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనము పథకం కింద పిల్లల కొరకు ఫైన్ క్వాలిటీ రైస్ ను 25 కేజీల బస్తాలలో స్కూళ్లకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినది. అయితే ఆ రైసు జిల్లాలో అందుబాటులో లేదు. అయినా సరే పైన క్వాలిటీ రైస్ అందుబాటులో ఉన్న జిల్లాలను కూడా దాటి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి స్థానంలో ఉంచడం జరిగినది. దీనికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు. దాదాపు 29 సంవత్సరాల సర్వీస్ అయ్యాక కూడా జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్న ఉత్సాహం ఆయనలో ఉండడం చాలా గొప్ప విషయమని అలానే ఆయనను చూసి ఆ పోటీ తత్వమును అందరూ అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ గారు తెలిపారు. అంతేకాకుండా ఆయన దృష్టిలో సెలవులు తీసుకోకుండా పనిచేసేది ఎవరంటే ఒకరు రెవెన్యూ డివిజనల్ అధికారి నరసాపురం ఇంకొకరు టీ. శివరామ ప్రసాద్ అని తెలిపారు. అలానే ఈ క్షణమైనా అందుబాటులో ఉంటారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర జిల్లా అధికారులు అయిన జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, డిప్యూటీ కలెక్టర్, జిల్లా రవాణా అధికారి, పీడీ డిఆర్డిఏ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ ఇతర మండల అధికారులు కూడా వారితో ఉన్న అనుబంధాన్నీ పంచుకున్నారు. ఆయన పని రాక్షసుడు అని అందరూ తెలియజేశారు. అందరితో కలిసిపోయి అందరితో ఎలా అన్న పని చేయించుకోగలడని, ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు పనిచేస్తూనే ఉంటారని తెలిపారు.

దీనికి ప్రతిస్పందనగా టీ.శివరామ ప్రసాద్ గారు జాయింట్ కలెక్టర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే వచ్చిన ఇతర అధికారులకు, సిబ్బందికి, రైస్ మిల్లర్లకు కృతజ్ఞతలు తెలియజేసారు. నేను విజయవంతంగా నా కార్యకలాపాలను ఈ జిల్లాలో నిర్వహించగలిగాను అంటే అది మీ అందరి యొక్క పూర్తి సహకారం మరియు తోడ్పాటుతోనేనని అందరికీ తెలియజేసి ధన్యవాదాలు తెలిపారు.