Press Release

Filter by:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామం పి.ఎం లంక అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతైనా అవసరమైన జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు.

Published on: 05/07/2025

నరసాపురం మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తతు గ్రామమైన పెద్దమైన వాని లంక గ్రామంలో డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి పనులను నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ ఎస్ పులిపాక సంయుక్తంగా శనివారం పరిశీలించారు. తొలుత పిఎం లంక డిజిటల్ భవన్ కు చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను […]

పీ4పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్

Published on: 05/07/2025

శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి పీ4పై జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమాజంలో సంపన్నులు (మార్గదర్శకులు) పేద, బలహీన వర్గాల వారిని (బంగారు కుటుంబం) దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సమాజం […]

భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు పక్క ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 05/07/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పట్టణ పారిశుద్ధ్యనికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టిన నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఇచ్చిన వాకీటాకీలను ఎందుకు వినియోగించడం […]

భవ్య భీమవరం పేరిట చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 05/07/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం ప్రాజెక్టుల పురోగతిపై భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మరియు ఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ఉన్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి, తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుందర పట్టణంగా రూపుదిద్దేందుకు చేస్తున్న కృషిలో […]

వేకువ జామునే భీమవరం పట్టణంలో శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 04/07/2025

సుమారు రెండు గంటల పాటు భీమవరం పట్టణంలో పారిశుద్ధ్య పనులు తనిఖీలు.. పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం ఊహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవ్.. భీమవరం పట్నంలోని 1, 5, 6 డివిజన్ ల్లోని పిపి రోడ్డు, ప్రకాశం చౌక్, డిఎన్ఆర్ కాలేజ్ బీసీ కాలనీ, వీరమ్మ మున్సిపల్ పార్క్ ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలు ముందు పారిశుద్ధ్య పనులు పరిశీలన.. వాణిజ్య సముదాయాల ముందు చెత్త వేస్తే చర్యలు తప్పవని సంబంధిత యజమానులకు సూచించడంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన వారికి […]

ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం

Published on: 04/07/2025

అల్లూరి స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శం వారి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పాటుపడాలి.. * రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ * శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ * జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. * భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ […]

పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి.

Published on: 03/07/2025

పరిశ్రమల స్థాపనకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకోవాలి. ..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం జిల్లా కలెక్టరేటు వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి తీసుకున్న చర్యలను సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, […]

చిన్నరంగడిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

Published on: 02/07/2025

మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూ వివరాలు ఆరా వండిన పదార్థాలను రుచి చూసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పట్టణంలో చిన్నరంగడిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలు కూర్చున్న బెంచి పై కూర్చుని వారితో ముచ్చటించారు. బాగా చదువుకుంటున్నారా, ఉపాధ్యాయులు బోధించే పాటలు అర్థం అవుతున్నాయా, వారు చెప్పిన పాఠములు ఇష్టముగా […]

ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 01/07/2025

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్‌ సామాజిక భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పెనుమంట్ర మండలం, ఆలమూరు గ్రామం ఇందిరమ్మ కాలనీలో పర్యటించి స్వయంగా లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా, లేదా అంటూ ఆరా తీశారు. ఇంటి వద్దకే వచ్చి […]

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Published on: 30/06/2025

అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి త్వరితగతిన పరిష్కారం తీసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ తో పాటు,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం అధికారి […]