వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎటువంటి ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 30/05/2025శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల లో ఓపెన్ ఇసుక రీచ్ ను జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని అన్నారు. పెండ్యాల రీచ్ నుండి జిల్లాలోని భీమవరం, ఆచంట, నరసాపురం, […]
Moreయోగ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 30/05/2025శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి యోగా రిజిస్ట్రేషన్స్, మాస్టర్ ట్రైనర్స్, ట్రైనర్స్ మ్యాపింగ్, యోగా పోటీలు, తదితర అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తాహసీల్దార్లు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలను సన్నద్ధం […]
Moreప్రాధాన్యతగా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు
Published on: 29/05/2025గురువారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మ్యాన్యువల్ స్కావెంజర్ నిషేధ మరియు పునరావాస చట్టంకు సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు జయ రామ కృష్ణ, బొత్స లక్ష్మీ దుర్గ, జిల్లెల సత్య సుధామ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మ్యాన్యువల్ స్కాంజెర్ కుటుంబ సభ్యులకు మెరుగైన అవకాశాలను కల్పించే దిశగా […]
Moreజిల్లాలో నూరు శాతం క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 29/05/2025జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన టిబి ఫోరం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని “నిక్షయ్ మిత్ర” గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం నిమిత్తం నెలకు రూ.600/- లు విలువగల పౌష్టికాహార సరుకులను అందచేయాల్సి […]
Moreఎస్సీ,ఎస్టీల వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/05/2025జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లెల్ల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ సిఎం మంగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై […]
Moreప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంద్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 29/05/2025గురువారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం నందు ఏర్పాటుచేసిన యోగ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. గంటపాటు జరిగిన యోగ శిక్షణ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా, మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను కచ్చితత్వంతో చేసి చూపటం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ, […]
Moreజూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు
Published on: 28/05/2025బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో రేషన్ షాపు నెంబర్.0537011 ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ షాపులు వద్దని నిత్యవసర సరుకులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలకోడేరు మండలం శృంగ వృక్షం రేషన్ షాపును జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం పేదలకు నిత్యవసర […]
Moreతెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాపురుషుడు. సంక్షేమానికి, సినీరంగానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త సర్గీయ నందమూరి తారక రామారావు జీవితం స్ఫూర్తిదాయకం. .. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి
Published on: 28/05/2025బుధవారం జిల్లా కలెక్టరేటు పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో సర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా పండుకు వాతావరణం లో నిర్వహించడం జరిగింది. తొలుత యన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా మే 28వ తేదీన మాజీ […]
Moreవశిష్టగోదావరిలో పడవల మీద, సాగర సంగమం వద్ద యోగాభ్యాసంలో ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి,డిఆర్వో యం.వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు …
Published on: 27/05/2025వశిష్ఠ గోదావరి అందాలు, పకృతి సౌందర్యాలు యోగా అభ్యాసన మంచి సందేశం, చక్కని స్పూర్తి. వశిష్ఠ గోదావరిలో రెండు పడవలలో యోగా అభ్యసన కార్యక్రమం పెద్ద హైలెట్. యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే ఆరోగ్యానికి బంగారుబాట. జూన్ 21వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. మంగళవారం స్థానిక వశిష్ట గోదావరిలో పడవులు, వలందర రేవు వద్ద యోగాభ్యాసంలో పాల్గొని ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు […]
More