Close

Press Release

Filter by:

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులను కలిసి సమస్యలు పరిష్కారానికి శ్రద్ధ చూపాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 09/06/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పి డి, కె.సి హెచ్ అప్పారావు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి […]

More

విద్య అనేది మనందరి జీవితంలో ముఖ్యమైన ఘట్టమని, షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలను విద్యార్థులు అందుకోవటంలో విద్య కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 09/06/2025

భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ -25 ప్రతిభా పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే మరియు పిఎసిఎస్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు సమాజం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి కారణం అందరూ విద్యను అభ్యసించకపోవడమేనని, అందరూ […]

More

భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద యోగాభ్యాసంతో మాన‌సిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంత‌మ‌వుతుంద‌ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 09/06/2025

యోగాంధ్ర – 2025లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నందు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి మరియు యోగ మాస్టర్ ట్రైనర్ బి.శిరీష యోగా విశిష్టతను వివరిస్తూ చెప్పిన యోగాసనాలు […]

More

జూన్ 6 నుండి జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 04/06/2025

బుధవారం జిల్లాలో నిర్వహించనున్న మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జూన్ 6వ తేదీ నుండి జూన్ 30 వరకు 23 రోజులు పాటు ఐదు సెంటర్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షలకు 16,634 మంది హాజరుకానున్నారని, […]

More

సరైన వైద్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని, ఇందుకు ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది కృషి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 04/06/2025

బుధవారం భీమవరం విష్ణు కాలేజీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని వివిధ వైద్య అంశాలు, పౌష్టికాహారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో డెలివరీలు చేయడం, మంచి వైద్య సేవలను అందించడం ద్వారా స్థానిక ప్రజలలో నమ్మకాన్ని పొందాలన్నారు. పీహెచ్సీలో డెలివరీకి వైద్యం దొరకదనే […]

More

దివ్యాంగులు, దీర్ఘకాలిక అస్వస్ధులు, వయోవృద్ధులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు

Published on: 03/06/2025

దివ్యాంగులకు, అస్వస్ధులకు, వయోవృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు.. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు రేషన్ పంపిణీ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నచ్చిన సమయంలో నచ్చిన తేదీన రేషన్ పొందే సౌలభ్యం ..పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మంగళవారం భీమవరం పట్టణం ఏడవ వార్డు గాంధీనగర్ లో స్థానిక రేషన్ డీలర్ నారి నరసింహారావు దీర్ఘకాలం అస్వస్థతతో మంచానికే పరిమితమైన గుమ్మళ్ళ రామారావు, వయోవృద్ధులు […]

More

యోగాను రోజువారీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావు: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/06/2025

యోగాసన అభ్యసనం ఆరోగ్యానికి మాత్రల పనిచేస్తుంది..’ ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో భాగ స్వామ్యులు అవుతున్న యువత, మహిళలు . .జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రతి ఒక్కరూ యోగ ప్రాధాన్యత తెలుసుకొని అనుసరించాలి: .. శాసనసభ్యులు పితాని సత్యనారాయణ యోగాను రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవడంద్వారా అనారోగ్య సమస్యలు రావని, ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క మాత్ర లాగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం ఉదయం పెనుగొండ మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ […]

More

జిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ 2027 నాటికి పక్కా ప్రణాళికతో పూర్తిచేసేలా సిద్ధం కావాలని కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ పుందిక్రా గోత్మరే అన్నారు.

Published on: 03/06/2025

సోమవారం కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలో చేపట్టబోయే జేజేఎం ప్రాజెక్టుపై కేంద్ర బృందం సభ్యులు చిన్మాయ్ పుందిక్రా గోత్మరే, కాల ఉజ్జ్వాల్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి సమీక్షించారు. తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత, ఇప్పటికే కొనసాగుతున్న వాటర్ స్కీములు, వాటి ద్వారా జరుగుతున్న నీటి సరఫరా తదితర వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా వివరించారు. అనంతరం కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ […]

More

ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 03/06/2025

సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లాస్థాయి పీఎంఏజీవై పథకం అమలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2020-21 సంవత్సరంలో పీఎంఏజీవై పథకం అమలుకు 50% పైబడి ఎస్సీజనాభా కలిగిన 10 గ్రామాలను, 2022-23 సంవత్సరంలో 40% పైబడి ఎస్సీజనాభా కలిగిన 11 గ్రామాలను మొత్తం 21 గ్రామాలను 9 మండలాల పరిధిలో నిబంధనల మేరకు ఎంపిక చేసి ప్రతిపాదనలను సమర్పించడం […]

More

జిల్లాలో క్షయ వ్యాధిని అంతం చేయడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 02/06/2025

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం పెనుగొండ మండలం సిద్ధాంతం టిబి యూనిట్ నందు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ క్యాంపెయిన్” ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా 60 సంవత్సరాల పైబడిన వారు, షుగర్ పేషెంట్స్, రోగానిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆల్కహాల్ తీసుకునేవారు, స్మోకర్స్, గతంలో […]

More