Press Release
వికలాంగత్వం చూసి చలించిన జిల్లా కలెక్టర్ .. తక్షణ చర్యలకు ఆదేశాలు…
Published on: 08/09/2025సోమవారం పీజిఆర్ఎస్ లో తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా హడావిడిగా ఉంది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరానికి వెళ్లే త్రోవలో దివ్యాంగుడైన బొడ్డు రాఘవేంద్ర వీల్ చైర్ లో మెలికలు తిరిగిపోతూ ఉన్న దృశ్యాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసి వారి వద్దకు వచ్చి ఏమైందని ప్రశ్నించారు. చిన్ననాటి నుండి ఇదే పరిస్థితి అని వీల్ చైర్ లో కూడా నిలకడగా కూర్చోపెట్టలేని […]
పశ్చిమగోదావరి జిల్లాలో యూరియా కొరత లేకుండా తీసుకున్న చర్యలు అభినందనీయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Published on: 07/09/2025ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉంది.. జిల్లాలో ఎరువులు కొరత లేదు, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు.. ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి –జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గత బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు పశ్చిమగోదావరి జిల్లాలో ఎరువులు కొరత లేకుండా ముందస్తుగా […]
వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు యూరియాను వినియోగించండి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 07/09/2025రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యూరియాను అందిస్తున్నా0 ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలపండి కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో విశాల సహకార సొసైటీ బ్యాంక్ నందు ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఎరువులను ఉపయోగించాలని అన్నారు అధికంగా […]
స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 06/09/2025శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి, లైవ్లీ హుడ్స్, అక్షర ఆంధ్ర లెటరసీ కార్యక్రమం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు […]
ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/09/2025ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించినప్పుడు తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ తోటి వారిని ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా స్పందించాలో రాష్ట్ర విపత్తుల సహాయబలం (ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్) బృందం నిర్వహించిన సామాజిక అవగాహన కార్యక్రమం విద్యార్థులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఎపి ఎండిఆర్ఎఫ్ బృందం జిల్లా అధికారులు, ప్రజలు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం […]
ఈ క్రాప్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 05/09/2025ఉండి మండలం యండగండి గ్రామంలో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఈ క్రాప్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు ఎలా జరుగుతున్నది, మండలంలో ఇప్పటివరకు ఎంత శాతం నమోదు ప్రక్రియ జరిగినది అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 10 వేల 500 ఎకరాలకు గాను 9 వేల ఎకరాల వరకు ఈ క్రాప్ నమోదు […]
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Published on: 05/09/2025శుక్రవారం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏ.యస్.ఆర్. నగర్ శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రము నందు నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు వ్యవహరించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు, శాసనమండలి సభ్యులు బొర్రా గోపీమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ మరియు ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, […]
ప్రభుత్వ సర్వీసులో కష్టపడి పనిచేస్తుంటే గుర్తింపు తానంతట అదే వస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 03/09/2025మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.వి.ఎస్ నాగలింగాచార్యులు పదవి వివరణ సందర్భంగా భీమవరం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న ప్రైవేటు కల్యాణ మండపం నందు ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో జెడి నాగలింగాచార్యులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పుష్పగుచ్చాన్ని అందజేసి, దుశ్యాలువాతో సన్మానించి, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
భవ్య భీమవరం అభివృద్ధి పనులు పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 03/09/2025బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రదేశాలలో చేపట్టిన పనులు పురోగతి మరియు పింక్ టాయిలెట్స్ నిర్మాణాలుకు తీసుకున్న చర్యలపై రెవెన్యూ, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవ్య భీమవరం పట్టణం సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం […]
జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 03/09/2025స్వచ్ఛ భారత్ మిషన్ & జల జీవన్ మిషన్ అమలు, నిర్వహణ పై బుధవారం దేశ ఢిల్లీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వీడియోకాన్ఫరెన్స్ సమావేశానికి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బి.వి.గిరి , తదితరులు పాల్గొన్నారు. డి డబ్ల్యు ఎం ఎస్ సెక్రటరీ మాట్లాడుతూ […]