Press Release

Filter by:

సముద్ర తీర ప్రాంత పర్యావరణ సమతుల్యతతో జల, చర ప్రాణులను కాపాడుకుందాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు

Published on: 20/09/2025

జల, చర ప్రాణుల సంరక్షణలో సముద్ర తీర ప్రాంత సమతుల్యతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి . సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ నందు బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా, మెప్మా మహిళలు, పరిశ్రమంల ప్రతినిధులు, అధికారులు, తదితరులతో కలిసి బీచ్ క్లీనింగ్ నందు […]

రేపు శనివారం పేరుపాలెం బీచ్లో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 19/09/2025

జాతీయ తీరప్రాంత మిషన్ పథకం క్రింద కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని తీరప్రాంత రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సహకారంతో సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని నిర్వహించడానికి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ని గుర్తించడం జరిగిందని, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 20 ఉదయం పేరుపాలెం బీచ్ […]

ఆక్వాజోనైజేషన్ నిర్ణయంలో కచ్చితత్వంతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కమిటీలను ఆదేశించారు.

Published on: 19/09/2025

శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ, మండల కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్వా జోనైజేషన్ కు ప్రతిపాదించిన నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి మార్పులు, చేర్పులు, తిరస్కరణకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,07,635.7 ఎకరాలలో ఆక్వా విస్తీర్ణం […]

మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోపుగా అమలు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 19/09/2025

జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ప్రగతిపై ఎక్సైజ్ సర్కిల్స్ వారీగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని, మద్యం డిపోల నుండి ప్రతి లిక్కర్ షాపుకు మద్యం సరఫరా, అమ్మకాలను వివరాలను పరిశీలించాలన్నారు. లిక్కర్ షాపు యజమానుల ఆర్డర్ ప్రకారం డిపోల నుండి మద్యం సకాలంలో […]

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి.

Published on: 18/09/2025

..ఈ-పంట, ఈ-కెవైసి నమోదు నూరుశాతం పూర్తి చేయాలి. ..ఖరీఫ్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, తహసిల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన […]

జిల్లాలో హోమ్ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకానికి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకం, ఎస్ టి పి ల ఏర్పాటుకు చర్యలు, శానిటేషన్ డ్రైవ్ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వర్మీ కంపోస్ట్ […]

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 18/09/2025

గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్ కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు. పారదర్శకత కొరకు ప్రతి దస్త్రాన్ని ఆన్ లైన్ లో […]

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 18/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కెవిఐబి అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు వివిధ వర్గాలను సమాయాప్తపరచడంతో పాటు ప్రోత్సాహక దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు చేసిన పరిశ్రమలను స్థాపించారా, ఉత్పత్తి […]

స్వచ్ఛోత్సవ్ 2025 వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 17/09/2025

బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, 2025, స్వచ్ఛోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ – ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారని ఆయన అన్నారు. విశాలమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పించడం, మురికిగా, కష్టంగా […]

విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 17/09/2025

చేతి వృత్తులకు ఏప్పుడు విలువ ఉంటుంది ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ […]