Close

Press Release

Filter:

ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టండి,అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 22/12/2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 265 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి జాప్యం లేకుండా పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి […]

More

ఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,859 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/12/2025

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడుపులోపు పూర్తి చేయకపోతే గుత్తేదారులపై తీవ్ర చర్యలు ఉంటాయి. నిర్లక్ష్య ధోరణిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు శనివారం రాత్రి పొద్దుపోయాక భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజయ్ వెంచర్స్, […]

More

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వ్యాయామానికి, క్రీడలకు కేటాయించాలి–రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ.

Published on: 21/12/2025

శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రస్థాయి పురోహిత్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో […]

More

22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/12/2025

పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెద్దఅమీరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పల్స్ పోలియో శిబిరంలో ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఉదయం 7.00 గంటల నుండి ప్రారంభమైందన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు గల 1,87,204 పిల్లలకు పోలియో […]

More

ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దయ, ప్రేమ, శాంతి, సేవా గుణాలను నేర్పించిన త్యాగమూర్తి ఏసుప్రభువు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 20/12/2025

భీమవరం బీవీ రాజు కళాశాల మినీ ఆడిటోరియం నందు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రేమ మూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు క్షమా గుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం అన్నారు. ఏసు ప్రభువు జన్మదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ […]

More

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తయారుచేసిన చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/12/2025

శనివారం నర్సాపురం మండలం రస్తుంబాద ఇంటర్నేషనల్ లేస్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన రెండవ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో -2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చేనేత, హస్త కళ ఉత్పత్తులతో ఇంత పెద్ద ఎత్తున నరసాపురాన్ని ఎంచుకొని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులు హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, గృహ ఉపకరణాలు, ఫర్నిచర్, లేసు ఉత్పత్తులు, కలంకారి […]

More

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి అన్నారు

Published on: 20/12/2025

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలలో పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమంను శనివారం భీమవరం మండలం చిన్నఅమీరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ ముస్తాబు కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. క్లాస్ రూములు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పశ్చిమను స్వచ్ఛ జిల్లాగా నిలిపేందుకు ప్రజలు, యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు

Published on: 20/12/2025

మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్ తో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో అండ్ భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక […]

More

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి–రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

Published on: 19/12/2025

గోదావరి పుష్కరాలు, కొల్లేరు గ్రామాల సరిహద్దుల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణ, తదిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సిఎస్ మాట్లాడుతూ జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే […]

More

“సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కి ఒరే 2025″ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 19/12/2025

సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా .. పరిపాలన గ్రామాల వైపు (“సుశాసన్ సప్తాహ్ .. ప్రశాసన్ గావ్ కీ ఒరే”) దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వర్చ్యువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రచార కార్యక్రమం డిసెంబర్ 19 నుండి 25 వ తేదీ వరకు […]

More