రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అపూర్య ఘన స్వాగతం…
Published on: 31/01/2025శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ అగ్రికల్చర్ మార్కెటు యార్డ్ లో ఏర్పాటు చేసిన హేలిఫ్యాడ్ నందు ఉదయం 11:53 నిమిషాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలికిన వారిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, బొల్లినేని శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర ఏపీఐఐసీ […]
Moreఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్
Published on: 29/01/2025• షెడ్యూల్ విడుదలైన నాటి నుండే అమలులోకి వచ్చిన మోడల్ కోడ్ • జిల్లాలో 69,884 మంది పట్టబుద్రుల ఓటర్లు • ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ ఎన్నిక […]
More76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు, స్టాల్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి…
Published on: 27/01/2025ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :దేశ భక్తిని, జాతీయ భావాన్ని రగిల్చేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పాలకొల్లు భారతి విద్యా భవన్, తణుకు జడ్పీ హై హైస్కూల్, భీమవరం పి ఎస్ ఎం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలలు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ బహుమతిని, పాలకొల్లు భారతీయ విద్యా భవన్ విద్యార్థుల బృందం ద్వితీయ బహుమతి, భీమవరం […]
More76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Published on: 27/01/2025• ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి • ఆకట్టుకున్న జంతు, సాంస్కృతిక ప్రదర్శనలు • అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాళ్లు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మడ్ రిజర్వు, సివిల్ మెన్, ట్రాఫిక్ […]
Moreజిల్లాలోని పశు రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని, పశువులను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 25/01/2025శనివారం ఆచంటలో ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తొలుత గోమాతకు శాస్త్రోకత్తంగా పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం పశువుల పరీక్షల నిర్ధారణలో వినియోగించే లేబరేటరీ పరికరాలను పరిశీలించారు. అందాల దూడల ఎంపికలో పాల్గొని, పుంగనూరు జాతి మినియేచర్ ఆవు దూడను స్వయంగా ఎత్తుకుని ముద్దు చేశారు. సూడి ఆవుకు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక పాల దిగుబడుని ఇచ్చే బర్రెలను, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా జిల్లాలోనే […]
Moreజిల్లాలో మేలు జాతి పువ్వుల సాగుకు విరివిగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
Published on: 21/01/2025సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెరవలి మండలం కాపవరం గ్రామంలో సాగు చేస్తున్న ఆర్కిడ్ (డెకరేటివ్ పూల సాగు) వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, సాగుదారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు, మొక్కలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత ఖర్చవుతుంది, ఎంతమంది పనిచేస్తున్నారు, ఒక స్టెమ్ ఖరీదు ఎంత పడుతుంది, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్కిడ్ వ్యవసాయ క్షేత్రం మేనేజర్ కెటికీన శ్రీనివాస మంగరాజు […]
Moreస్వచ్ఛ పశ్చిమగోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలభాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 18/01/2025నేడు మూడోవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమం తెలుగు మాసంలో మొదటిగా భీమవరం ఆదర్శనగర్ పార్క్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయలతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పార్కు నందు స్వయంగా చెత్తను తొలగించి శుభ్రపరిచారు. స్థానిక ప్రజలతో పరిశుభ్రతపై, ప్లాస్టిక్ ను నిరోధించడంపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreసాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 09/01/2025గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా ఖజానా కార్యాలయం నందు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్యోతిని వెలిగించి ప్రారంభించి, ఖజానా కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకగా జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ప్రశంశించారు. కోలం ముగ్గులను, బొమ్మల కొలువును అలంకరణలను పరిశీలించి చాలా బాగుందని కితాబ్ ఇచ్చి, ఈ అలంకరణలో పాల్గొన్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ […]
Moreవిద్యార్థులు భవిష్యత్ మార్గ నిర్దేశకులు అని, పాఠశాల విద్య నుండే ఉన్నతంగా చదివి మంచి భవిష్యత్తుకు ఏర్పరచుకోవాలని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Published on: 06/01/2025రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం అందుకే స్పూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు! చాగంటి సలహాలతో నైతిక విలువలపై పాఠ్యాంశాలు ఉండి అభివృద్ధికి రఘురామ చేస్తున్న కృషి భేష్ టాటా సేవలకు గుర్తుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సుడిగాలి పర్యటన…… సోమవారం ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు […]
Moreపిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు.
Published on: 06/01/2025శనివారం వీరవాసరం ఎం ఆర్ కె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సభా అధ్యక్షులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ […]
More