పేరుపాలెం, కేపీ పాలెం బీచ్ సందర్శికుల రక్షణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 07/10/2025మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కూడా పాల్గొన్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని బీచ్ ల సందర్శకులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోకుండా అవసరమైన ముందస్తు చర్యలను సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేరుపాలెం బీచ్ పర్యాటకులకు చాలా […]
Moreఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 07/10/2025మంగళవారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిఆర్డిఏ, పశుసంవర్ధక శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1,419 యూనిట్లు మంజూరు కావడం జరిగిందని, ఎస్ హెచ్ జి మహిళలు వీటి స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. పెరటి కోళ్లు, ఎద్దులు, దూడలు, పాడి గేదెలు, మేకలు పెంపకం యూనిట్లు, మినీ […]
Moreలైసెన్సు లేకుండా ఏ విధమైన టపాసులు తయారుచేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 07/10/2025నిబంధనలకు విరుద్ధంగా దీపావళి టపాసులు అమ్మకాలు నిర్వహించే షాపులపై చర్యలు తప్పవు.. షాపులలో మందు గుండు సామాగ్రి అమ్మకానికి పిల్లలను, బాల కార్మికులను వినియోగిస్తే నిబంధనల మేరకు చర్యలు తీవ్రంగా ఉంటాయి… గతంలో లైసెన్సులు పొంది ప్రస్తుతం రెన్యువల్ కానీ ముందుగుండు సామాగ్రి షెడ్లను క్షేత్రస్థాయిలో పోలీస్, రెవిన్యూ శాఖలు విధిగా తనిఖీసి ధ్రువీకరించాలి… నిబంధనలు మీరిన మందు గుండు సామాగ్రి తయారీ, అమ్మకం షాపులపై చర్యలకు అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదు… ఏదైనా సంఘటన […]
Moreప్రపంచ దేశాలు మెచ్చే విధంగా పరిశుభ్రతలో భారతదేశం తలమానికంగా నిలిపేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Published on: 06/10/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, […]
Moreఅధికారులు ప్రతిరోజు విధిగా కొంత సమయం కేటాయించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 06/10/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలి. *సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 168 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా […]
Moreజిల్లా సమగ్ర అభివృద్ధికి నూతన పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలి–జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/10/2025కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అధికారులతో పెట్టుబడులు.. సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా రంగాలలో నూతన వరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు, నూతన ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. […]
Moreచేనేత, టెక్స్టై టైల్స్, రెడీమేడ్ ఉత్పత్తులపై జిఎస్టి తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 04/10/2025ఎస్టీ సంస్కరణల వల్ల తగ్గిన ధరల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. సూపర్ జిఎస్టి….సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన చేనేత వస్త్రాలు, భీమవరానికి చెందిన సీఎంఆర్, రేమాండ్స్, ఇభా స్టోర్స్ వారు ఏర్పాటు చేసిన రెడీమేడ్ […]
Moreఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అభివర్ణించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
Published on: 04/10/2025ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ల డ్రైవర్లకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం.. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి ప్రభుత్వ విధానాల విషయంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ భరోసానిచ్చారు. శనివారం భీమవరం మున్సిపల్ కార్యాలయం […]
Moreఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 03/10/2025మిల్లర్ల నుండి నాణ్యమైన గోనే సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ, రీ సర్వే, జిఎస్టి, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఇళ్ల స్థలాలు తదితర అంశాల ప్రగతిపై మండలాల వారీగా డిఆర్ఓ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా […]
Moreరీ సర్వేలో వచ్చిన ప్రతి పిటిషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు
Published on: 03/10/2025రీ సర్వే ఫేజ్ -2 లో ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన 675 రైతుల భూములలో రీ సర్వే నిర్వహించగా 225 మంది రైతుల నుండి విస్తీర్ణంలో తేడాలు వచ్చాయని అప్పీల్ చేసుకోగా, దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పాందువ్వ గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 675 మంది రైతులకు భూములు ఉండగా […]
More