బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల వద్ద సిబ్బంది, సామగ్రి తో పొజిషన్ లో ఉండాలి
Published on: 28/10/2025లోతట్టు ప్రాంత ప్రజలను అవసరమైతే ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలి పునరావాస కేంద్రాల్లో రుచికరమైన భోజనం, అల్పాహారం అందించడంతోపాటు, స్వచ్ఛమైన తాగునీటినందించాలి పునరావస కేంద్రాల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లు ఎక్కడా రాజీ పడని విధంగా ఏర్పాటు చేయాలి. జనరేటర్ లను సిద్ధంగా ఉంచుకోవాలి బలమైన ఈదురుగాలులకు విద్యుస్తంభాలు, కరెంట్ లైన్లు తెగిపడే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు జిల్లాలో […]
More“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/10/2025జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల వద్ద ఇంచార్జ్ అధికారులు 24 గంటలు అప్రమత్తతతో ఉండాలి. జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. మండలాలకు పంపే డ్రోన్స్ తక్షణం వినియోగంలోనికి తీసుకురావాలి. మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి వి.ప్రసన్న వెంకటేష్, జిల్లా […]
More“మొంథా తుపాను” సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
Published on: 27/10/2025తుఫాన్ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైనదని, కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. …..రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా. “మొంథా తుపాను” నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ఏర్పాట్లుపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించేందుకు సోమవారం భీమవరం కలెక్టరేట్ చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, […]
Moreసచివాలయాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామస్థాయిలో సైతం యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/10/2025మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు.. భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ.. తుఫాన్ కారణంగా ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేసాం ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నాం. తుఫాను ప్రభావితమయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పునరావాస కేంద్రాలు గుర్తించి, ఆహార పదార్థాలను, […]
More“మొంథా తుపాను” సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తిన ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219 సంప్రదించాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/10/2025“మొంథా తుపాను” నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించి కంట్రోల్ రూమ్ కు ప్రజల నుండి వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ […]
Moreనిత్యవసర వస్తువులు నిలువలు ఉంచడం, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను బలోపేతం చేయడానికి అవసరమైన మెటీరియల్ సిద్ధం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 26/10/2025మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అంతట పూర్తి అప్రమత్తతతో అధికార యంత్రాంగం సన్నద్ధమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రానున్న తీవ్రమైన మొంథా తుఫాను ధృష్ట్యా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జిల్లాలోని 07 అగ్ని మాపక కేంద్రాల పరిధిలోని 90 మంధి సిబ్బంధి అంధరిని అప్రమత్తంగా వుంచడంతో పాటు, అగ్ని మాపక వాహనములు మరియు అత్యవసర పరికరములు అన్నింటిని సిద్ధంగా వుంచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా […]
More“మొంథా తుపాను” ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి.
Published on: 26/10/2025జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి తుఫాను దృష్ట్యా కార్తీక మాసం సందర్భంగా పేరుపాలెం బీచ్ లో భక్తుల సముద్ర స్నానాలకు అనుమతి లేదు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08816 – 299219 ….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ” మొంథా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే సన్నద్ధత ఏర్పాట్లపై […]
Moreజిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 25/10/2025“మంతా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 90 – 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తుఫాన్ తీరం దాటే వరకు అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్రయాణాలు చేయాలి జిల్లా అధికారులకు, సిబ్బంది సెలవులు రద్దు, […]
Moreయువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు లోబడకుండా చూసే ప్రధాన బాధ్యతను ఎక్సైజ్ అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 25/10/2025జిల్లాలో గంజాయి వినియోగం అనే మాట ఎక్కడ వినిపించకూడదు యువత, విద్యార్థులు గంజాయి ఆకర్షణకులోను కాకుండా చూసే బాధ్యత ఎక్సైజ్ అధికారులదే ఎక్సైజ్ అధికారులు గంజాయిపై తనిఖీలు ముమ్మరం చేయాలి.. కళాశాలల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తరచూ కలిసి మాట్లాడాలి… మద్యం వినియోగదారులు సురక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి మద్యం షాపులు, బార్లు వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగాలి జిల్లాలో జనవరి 2025 నుండి 24 అక్టోబర్, 2025 వరకు 442 అక్రమ […]
Moreదేశంలోనే ఒకే ఒక్క జిల్లాగా బ్రాకిష్ (ఉప్పునీరు) ఆక్వా సాగుకు గుర్తించి పశ్చిమగోదావరి జిల్లాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..
Published on: 25/10/2025ఉప్పునీటి (బ్రాకిష్) ఆక్వా సాగుదారులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సిఎఎ) కింద రిజిస్టర్ కావాలి బ్రాకిష్ ఆక్వా సాగులో సిఎఎ నిబంధనలు తూచా తప్పక పాటించాలి బ్రాకిష్ ఆక్వా సాగుదారులు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనాలు పొందడానికి సిఎఎ రిజిస్ట్రేషన్ తప్పనిసరి రైతులు ఎగుమతులకు ఆటంకం లేని యాంటీబయటిక్ ఫ్రీ ఆక్వా ఉత్పత్తుల సాగుకు కృషి చేయాలి ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా సిఎఎ కింద రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత […]
More