రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్మడం ద్వారా లాభం పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 30/10/2025గురువారం పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించగా, ధాన్యములోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన […]
Moreపంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల మేరకు రైతులకు సహాయం అందించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 30/10/2025గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయ పాలెం, పెంటపాడు మండలంలోని రావిపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాలలో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్ట పోయామని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, పంట తయారైన తర్వాత యంత్రం ద్వారా కొయ్యడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే […]
More” మొంథా తుపాను” ను పూర్తి సన్నద్ధతతో 24 గంటల విధులలో నిమగ్నమై అహర్నిశలు పనిచేసిన జిల్లా, డివిజనల్, మండల, సచివాలయ అధికారులకు సిబ్బందికి నా కృతజ్ఞతలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 30/10/2025తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు పత్యేక శ్రద్ధ పెట్టాలి. ముంపు ప్రాంతాలలో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి బాధితునకు బియ్యం, నిత్యవసర సరుకులు తక్షణమే అందించాలి. తుఫాను అనంతరం పరిస్థితులపై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, […]
Moreనీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 29/10/2025భీమవరం మండలం చిన్నఅమీరం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా నీటమునిగిన వరి పొలాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తుఫాను కారణం నీట మునిగిన వరి పొలాలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 5,984 ఎకరాలు వరి పంటకు గాను 1,689 రైతులకు సంబంధించిన 3,340 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను […]
Moreరైతులకు ఇబ్బంది లేని విధంగా సాగునీరు సాఫీగా పారేందుకు రానున్న రెండు నెలల్లో కాలువలు, డ్రైయిన్లు ఆక్రమణలను నూరు శాతం తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
Published on: 29/10/2025బుధవారం ఉండి మండలం వాండ్రం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా బలమైన గాలుల ప్రభావంతో నేలకొరిగిన వరి పంటను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాండ్రం గ్రామంలోని 600 ఎకరాలకు సంబంధించిన నీరు ఇసుక డ్రెయిన్ ద్వారా వెళ్లవలసి ఉంటుందని, డ్రెయిన్ కుంచించుకుపోవడంతో సాగునీరు సాఫీగా పారుదల లేక పంట నష్టపోతున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా ఈ […]
Moreమీకు పెట్టే భోజనమే నేను తింటా.. మీతోనే మేము.. ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/10/2025కలెక్టర్ అమ్మ.. తుఫాన్ బాధితులతో సహపంక్తి భోజనం… కుశల ప్రశ్నలు.. ప్రజలకు ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం అండగా నిలుస్తుంది … పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా.. నరసాపురం మండలం పెద్దమైన వానిలంక డిజిటల్ భవన్, వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్, మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల సందర్శన, ఆశ్రయం పొందిన వారితో ఏర్పాట్లపై ఆరా.. తుఫాను […]
Moreమొంథా తుఫాన్ తీరం దాటినట్లు ప్రకటించిన నరసాపురం మండలం బియ్యపు తిప్ప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/10/2025చిన్నమైనవాని లంక నల్లిక్రిక్ ఉప్పొంగి, రోడ్డు కోతకు గురై గండిపడిన ప్రాతం సందర్శన .. నల్లిక్రిక్ గండి కారణంగా చుట్టుపక్కల సుమారు 1200 వందల ఎకరాలలో ఉప్పునీటి రొయ్యల చెరువులు గట్టులు తెగి జలసంద్రం … వేముల దేవి ఈస్ట్ వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్ల పైనుండి పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలోని చొచ్చుకు వచ్చిన నీటిని పరిశీలించి, బాధితుల పరామర్శ… బుధవారం తెల్లవారుజామున తీరం దాటిన మొంథా తుఫాన్ కారణంగా నరసాపురం మండలంలో దెబ్బ తిన్న […]
More“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
Published on: 28/10/2025జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తుఫాను అనంతరం పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ….జిల్లా ఇన్చార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం సమావేశ మందిరంలో “మొంథా తుపాను” సందర్భంగా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై జిల్లా […]
Moreజిల్లాలో సుమారు 9 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం, తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 28/10/2025మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్ తో ఏర్పాటు చేసిన టెలీ కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. • ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై ఫోకస్ అధికారులు ఫోకస్ పెట్టాలి. • […]
Moreతుఫాన్ పునరావాస కేంద్రంను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/10/2025మంగళవారం కాళ్ల మండలం కల్వపూడి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ తుఫాన్ బాధితులుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేల చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస […]
More