Close

Press Release

Filter by:

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/11/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎం.రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 232 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా […]

More

నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు–ప్రత్యేకంగా అభినందించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/11/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు వచ్చినందుకు పూల మొక్కను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేక ఆపరేషన్, దర్యాప్తు మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో 2025 సంవత్సరానికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా “కేంద్రీయ గృహమంత్రి […]

More

పశ్చిమగోదావరి జిల్లాలోని నలుగురు ఉద్యోగులు మొంథా తుఫాన్ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక…

Published on: 03/11/2025

రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేత.. ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. మొంథా తుఫాన్ సమయంలో సంసిద్ధత, సహాయ కార్యకలాపాలలో అంకితభావం, నాయకత్వం, అవిశ్రాంత కృషికి గుర్తింపుగా రాష్ట్రస్థాయి ఎంపికలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నవంబర్ ఒకటిన విజయవాడలో అవార్డుల ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా […]

More

జిల్లాలో 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు సామాజిక పింఛన్ల పంపిణీ..

Published on: 01/11/2025

సామాజిక పింఛన్లు వృద్ధులకు వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు శనివారం భీమవరం పట్టణం 19వ వార్డు భీమేశ్వర స్వామి ఆలయం పక్క వీధిలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అభయ హస్తం, దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు 19వ వార్డులోని మొత్తం 246 […]

More

మన భీమవరంలో బోటు షికార్–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/11/2025

బివి రాజు వీరమ్మ పార్క్ నందు బోటు షికార్ ఏర్పాటు పెద్దలకు, పిల్లలకు బోటు షికారుతో ఆహ్లాదం.. నేడు వాటర్ బోటింగ్ ప్రారంభం.. భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నేడు బివి రాజు వీరమ్మ పార్కులో బోటు షికారుని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా భీమవరం పట్టణంలోని బీవీ రాజు వీరమ్మ పార్క్ నందు బోటు షికారును […]

More

“మొంథా తుపాను” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధ, సమన్వయంగా పనిచేయడం ద్వారా జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించ గలిగాము

Published on: 31/10/2025

మరో రెండు రోజుల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను యధాస్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీరవాసరం మండలం కొణితవాడ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తుఫాన్ బాధితులకు నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం 25 కేజీలు, కంది పప్పు 1 కేజీ, పంచదార 1 కేజీ, వంటనూనె 1 లీటరు, బంగాళాదుంపలు […]

More

గృహహింస, మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/10/2025

బాలల సంరక్షణ సంస్థలు వారికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా స్వశక్తితో జీవించే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బాల్య వివాహాల నిరోధానికి ప్రజలకు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లాలో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]

More

భవిష్యత్తులో నీటి ముంపుకు గృహాలలో నీళ్లు చేరాయి అనే మాట వినిపించని విధంగా శాశ్వత చర్యలు ఉండాలని అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/10/2025

భీమవరం రూరల్ లో తుఫాన్ కారణంగా ముంపు గురైన ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. గూట్లపాడు శివారు, కొత్త పూసల మర్రు, దొంగపిండి ప్రాంతాలు కొద్దిపాటి వర్షాలకే నీటి ముంపుకు కారణాలను తెలుసుకునేందుకు ఉప్పుటేరులో పంటుపై ప్రయాణం ఉప్పుటేరులో గంటసేపు పంటులో ప్రయాణించి స్లూయిస్ ని చేరుకొని క్షేత్రస్థాయిలో స్లూయిస్ పరిశీలన.. వెంటనే స్లూయిస్ ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు ముంపు ప్రాంతాలలో శాశ్వత చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, ప్రస్తుతం చేయగలిగిన పనులను వెంటనే […]

More

“మొంథా తుపాను” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధతో జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించగలిగాం..

Published on: 30/10/2025

జిల్లాలో భారీ వర్షాల కారణంగా నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తాయి.. ……కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం 25 కేజీలు, […]

More

తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

Published on: 30/10/2025

తుఫాను ప్రభావిత ప్రాంతాల కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, కందిపప్పు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఒక్కొక్క కేజీ చొప్పున, పామ్ ఆయిల్ ఒక లీటర్ చొప్పున మొత్తం కిట్ ల పంపిణీ నేటి నుండి ప్రారంభం గురువారం పెంటపాడు మండలం రావిపాడులో వరద బాధితులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More