Close

Press Release

Filter by:

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు

Published on: 11/11/2025

మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ […]

More

భారతదేశ విద్యావ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 11/11/2025

మంగళవారం జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 జయంతి కార్యక్రమంను జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని శ్రీ మౌలానా అబుల్ కలం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. […]

More

జిల్లాలోని ఆక్వా రైతులు ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్‌పో ద్వారా ఆక్వాకల్చర్ రంగంలో తాజా ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలపై పూర్తి అవగాహన పొంది ఆక్వా ఉత్పత్తులలో జిల్లాను మేటిగా నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 11/11/2025

మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుండి “ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్‌పో హైదరాబాద్” ఆక్వా సదస్సుకు జిల్లా నుండి వెళుతున్న 40 మంది ఆక్వా రైతులకు ఏర్పాటుచేసిన టూరిస్ట్ బస్సును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వరల్డ్ ఆక్వాకల్చర్ 2025 ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆక్వా ఎక్స్ పో నవంబర్ 11, 12, 13 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు. […]

More

నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు నవంబర్ 13న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు

Published on: 10/11/2025

సోమవారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 13వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ […]

More

ఇంటింటా సర్వేలో భాగంగా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 10/11/2025

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా నవంబర్ 17వ తేదీ నుండి నవంబరు 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టివ్యాధి పై ప్రచురించిన అవగాహన పోస్టర్ను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 10/11/2025

సోమవారం స్థానిక కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో […]

More

వసతి గృహాలలో చదువుకున్న వారు ఎంతోమంది ప్రయోజకులు అయ్యారని, వారి స్ఫూర్తిగా మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను ఎదగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 09/11/2025

ఆదివారం తణుకు పట్టణం 13వ వార్డు ఇరగవరం రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలు ప్రత్యేక నిధులతో హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో హాస్టల్ లోపల ఫ్లోరింగ్ చేయించి ఫౌండేషన్ ఎత్తు, టైల్స్ నిర్మాణము చేసి ఆధునీకరించిన పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. వసతి గృహం విద్యార్థినులతో ఆమె మాట్లాడారు. గతంలో వర్షము కురిస్తే వర్షము నీరు హాస్టల్ […]

More

ఆధునిక కవిగా ప్రజలలో భక్తి సామాజిక బాధ్యత సమనాత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/11/2025

శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడు ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా […]

More

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం బాగుంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 09/11/2025

సఖి సురక్ష శిబిరాలను .. పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు 35 ఏళ్లు నిండిన వారికి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహణ.. శనివారం భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం, ఈ-వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ‘సఖి సురక్ష’ వైద్య శిబిరం ప్రారంభోత్సవ […]

More

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 08/11/2025

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక, సైక్లింగ్, యోగాకు కొంత సమయం కేటాయించాలి. “ఫిట్ ఇండియా” కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం విష్ణు కళాశాల వద్ద “ఫిట్ ఇండియా – సైక్లోథాన్” కార్యక్రమానికి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విష్ణు కాలేజీ నుండి జువ్వలపాలెం అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా […]

More