ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/12/2025ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేయాలి. కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు అక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటను రెవిన్యూ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు. భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని రెవిన్యూ అధికారులతో పీజీ ఆర్ఎస్, 22 ఏ, ఐ వి ఆర్ ఎస్, రీ సర్వే, కోర్టు కేసులు, ముటేషన్, ఇళ్ల నిర్మాణం, తదితర […]
Moreజిల్లాలో రబి సీజనుకు సరిపడినంత యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్ ఎస్ కె లు, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. రైతాంగం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
Published on: 23/12/2025ఎంఆర్పీ ధర కన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. రైతులకు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తే పరిష్కార చర్యలు తీసుకుంటాం. యూరియా లభ్యత, ధరలు, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాలుపై గూగుల్ మీట్ ద్వారా జాయింట్ కలెక్టర్ రైతులతో ముఖాముఖి…… యూరియా సరఫరాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు.. ….జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ […]
Moreఅవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు బుక్ చేయాలని తహసిల్దారుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 22/12/2025ఆచంట నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం… ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.. గతంలో పట్టాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవ్… ఆచంట నియోజకవర్గం ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, నియోజవర్గం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పెనుగొండ మండలం […]
Moreవిద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 22/12/2025వీరవాసరం ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను ప్రారంభించారు. తొలుత మ్యాజికల్ సైన్స్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి నివాళులర్పించారు. అలాగే భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి […]
Moreప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టండి,అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 22/12/2025ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 265 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి జాప్యం లేకుండా పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి […]
Moreఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,859 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/12/2025ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడుపులోపు పూర్తి చేయకపోతే గుత్తేదారులపై తీవ్ర చర్యలు ఉంటాయి. నిర్లక్ష్య ధోరణిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు శనివారం రాత్రి పొద్దుపోయాక భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజయ్ వెంచర్స్, […]
Moreసంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వ్యాయామానికి, క్రీడలకు కేటాయించాలి–రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ.
Published on: 21/12/2025శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రస్థాయి పురోహిత్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో […]
More22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/12/2025పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెద్దఅమీరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పల్స్ పోలియో శిబిరంలో ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఉదయం 7.00 గంటల నుండి ప్రారంభమైందన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు గల 1,87,204 పిల్లలకు పోలియో […]
Moreప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దయ, ప్రేమ, శాంతి, సేవా గుణాలను నేర్పించిన త్యాగమూర్తి ఏసుప్రభువు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 20/12/2025భీమవరం బీవీ రాజు కళాశాల మినీ ఆడిటోరియం నందు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రేమ మూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు క్షమా గుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం అన్నారు. ఏసు ప్రభువు జన్మదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ […]
Moreభారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తయారుచేసిన చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 20/12/2025శనివారం నర్సాపురం మండలం రస్తుంబాద ఇంటర్నేషనల్ లేస్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన రెండవ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో -2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చేనేత, హస్త కళ ఉత్పత్తులతో ఇంత పెద్ద ఎత్తున నరసాపురాన్ని ఎంచుకొని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులు హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, గృహ ఉపకరణాలు, ఫర్నిచర్, లేసు ఉత్పత్తులు, కలంకారి […]
More