Close

Press Release

Filter:

శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Published on: 01/12/2025

గోదావరి క్రీడా సంబరాల ఆటల పోటీలలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలి. సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్న గోదావరి క్రీడా సంబరాల సంబరాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయి అన్నారు. కావున, జిల్లా అధికారుల […]

More

ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నది, భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి.

Published on: 01/12/2025

సోమవారం ఉండి గ్రామం ఒకటవ వార్డులో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా […]

More

హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి సూచించారు

Published on: 01/12/2025

ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్స‌వం సంద‌ర్భంగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద అవ‌గాహ‌నా ర్యాలీని సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రకాశం చౌక్ వ‌ర‌కు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సంద‌ర్భంగా జిలా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎయిడ్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండేందుకు నిరంత‌రం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎయిడ్స్ బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలో సుమారు 1,500 మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. కొత్తగా […]

More

మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగంలో చేరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి.

Published on: 29/11/2025

శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భీమవరంలోని ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పీఏసీ చైర్మన్ […]

More

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రైతుల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 29/11/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దిత్వ తుఫాను కారణంగా జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలన్నారు. ధాన్యం నూర్పిడి అయితే వెంటనే ధాన్యం […]

More

ఏప్రిల్ 15 నాటికి దళ్వా పంటసాగు పూర్తి అయ్యేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలి. …. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 29/11/2025

శనివారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రభీ సాగుకు రైతులకు ఎటువంటి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుండి దళ్వా సాగుకు నీటి సరఫరాకు […]

More

“దిత్వా తుఫాను” ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు తమ డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులకు అవగాహన కల్పించి సన్నద్ధత ఏర్పాట్లు చేయాలి. …జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 28/11/2025

శుక్రవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి ద్విత్వా తుఫాను ప్రభావంపై సన్నద్ధత, ధాన్యం కొనుగోలు ప్రగతి పై డిఆర్ఓ, ఆర్డీవోలు, తహసిల్దార్లు, డీఎస్ఓ, డిసిఓ, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుఫాను కారణంగా రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ప్రస్తుతం వాతావరణం బాగుందన్న ఆలోచనతో […]

More

నేడు నేర్చిన విద్య ఎన్నటికీ తరిగిపోదు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 28/11/2025

ఒక అమ్మలా లాలించి, గద్దించి విద్యార్థులకు చదువు ఎంతో ఉపయోగమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తున్నారా, సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు అని ప్రశ్నించారు. మీలో చాగంటి కోటేశ్వరరావు రచించిన “విలువల విద్య” పాఠాలను ఎంతమంది చూశారు […]

More

దిత్వా తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Published on: 28/11/2025

శుక్రవారం గణపవరం మండలం జల్లి కొమ్మర గ్రామంలో రైతు సేవా కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచులు సంబంధించిన రిజిస్టరును, ట్రక్ షీట్ లు పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమశాతం నమోదు చేయాలని ఆదేశించారు. దిత్వా తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి […]

More

తణుకు జిల్లా ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలతో రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 28/11/2025

శుక్రవారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయి కిరణ్ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 21 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ కొన్ని పనులకు […]

More