Close

Press Release

Filter by:

పాడి రైతులకు సబ్సిడీపై సమీకృత పశు దాణా పంపిణీ జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి

Published on: 31/05/2025

శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీ సమీకృత దాణా పంపిణీ కార్యక్రమంను జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా కలిసి 18 మంది పాడి రైతులకు దాణా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం […]

More

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి

Published on: 31/05/2025

శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని మిలటరీ కాలనీ, రూరల్ మండలం వెంకట రామన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి గ్రామంలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి మాట్లాడుతూ రాష్ట్ర […]

More

జూన్ ఒకటో తేదీ నుండి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 31/05/2025

శుక్రవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి టి.రాహుల్ కుమార్ రెడ్డి జూన్ 1 నుండి రేషన్ దుకాణం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పై పౌరసరఫరాల అధికారులు, ఆర్డీవోలు, తహసిల్దార్లు సిఎస్ డిటిలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ ఒకటో తేదీ నుండి అన్ని రేషన్ దుకాణాలు ద్వారా నిత్యవసర సరుకులు […]

More

వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎటువంటి ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 30/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల లో ఓపెన్ ఇసుక రీచ్ ను జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని అన్నారు. పెండ్యాల రీచ్ నుండి జిల్లాలోని భీమవరం, ఆచంట, నరసాపురం, […]

More

యోగ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 30/05/2025

శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి యోగా రిజిస్ట్రేషన్స్, మాస్టర్ ట్రైనర్స్, ట్రైనర్స్ మ్యాపింగ్, యోగా పోటీలు, తదితర అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తాహసీల్దార్లు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలను సన్నద్ధం […]

More

ప్రాధాన్యతగా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 29/05/2025

గురువారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మ్యాన్యువల్ స్కావెంజర్ నిషేధ మరియు పునరావాస చట్టంకు సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు జయ రామ కృష్ణ, బొత్స లక్ష్మీ దుర్గ, జిల్లెల సత్య సుధామ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మ్యాన్యువల్ స్కాంజెర్ కుటుంబ సభ్యులకు మెరుగైన అవకాశాలను కల్పించే దిశగా […]

More

జిల్లాలో నూరు శాతం క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 29/05/2025

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన టిబి ఫోరం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని “నిక్షయ్ మిత్ర” గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం నిమిత్తం నెలకు రూ.600/- లు విలువగల పౌష్టికాహార సరుకులను అందచేయాల్సి […]

More

ఎస్సీ,ఎస్టీల వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/05/2025

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లెల్ల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ సిఎం మంగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై […]

More

ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా యోగాంద్ర కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో విజ‌యవంతం చేసేందుకు భారీ ప్ర‌ణాళిక‌ను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 29/05/2025

గురువారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం నందు ఏర్పాటుచేసిన యోగ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. గంటపాటు జరిగిన యోగ శిక్షణ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా, మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను కచ్చితత్వంతో చేసి చూపటం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ‌, […]

More

జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు

Published on: 28/05/2025

బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో రేషన్ షాపు నెంబర్.0537011 ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ షాపులు వద్దని నిత్యవసర సరుకులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలకోడేరు మండలం శృంగ వృక్షం రేషన్ షాపును జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం పేదలకు నిత్యవసర […]

More