Close

Press Release

Filter by:

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడంతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు

Published on: 19/05/2025

ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 172 …..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా […]

More

తణుకు జిల్లా ఆస్పత్రిని అందరి సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 18/05/2025

శనివారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.అరుణ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 26 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. కొన్ని పనులకు ఆమోదం తెలుపగా, మరికొన్ని అంశాలు సంబంధించి సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని […]

More

వాతావరణం సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎండ వేడి నుండి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 18/05/2025

స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం హిట్ ద బీట్ థీమ్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తణుకు జిల్లా ఆసుపత్రి నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపున నిర్మించనున్న పింక్ టాయిలెట్స్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ప్రాంగణం […]

More

ప్రతి పట్టణం, గ్రామంలో ప్రతి మహిళ ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాల్లో కంపోస్ట్ తయారు చేసి కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు వినియోగించడం ద్వారా తడిచెత్త డంపింగ్ కాకుండా సద్వినియోగం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి తెలిపారు.

Published on: 18/05/2025

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ఒక థీమ్ తో నిర్వహించే కార్యక్రమానికి శనివారం తణుకు పట్టణంలో ఏర్పాటుచేసిన “హిట్ ద బిట్” కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద కొబ్బరి బొండాల దుకాణదారులకు ఐడి కార్డులను అందజేశారు. పట్టణంలో మొత్తం 24 మంది కొబ్బరి బొండాల దుకాణదారులను గుర్తించి మున్సిపల్ […]

More

ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంత మయ్యాయని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు

Published on: 17/05/2025

పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంతమైన సందర్భంగా శనివారం భీమవరం పట్టణంలో వీసాకోడేరు వంతెన వద్ద నుండి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనము వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, స్థానిక […]

More

స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయడంతో పాటు, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 17/05/2025

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో పక్కాగా నిబంధనలను పాటించాలని సూచించారు. తల్లిదండ్రులులేని పిల్లలను, భిక్షాటన చేసే పిల్లలను, బాల కార్మికులను గుర్తించి హోమ్ ఉంచి కచ్చితంగా చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను వదిలేసిన, అనధికారికంగా దత్తత ఇచ్చిన […]

More

రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నాణ్యమైన, స్థానిక వినియోగానికి అనుకూలమైన సాగు రకాలను పండించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు

Published on: 17/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లా, మండల ప్రాంతాలవారీగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు రకాలపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పండిస్తున్న పిఆర్ 126 వరి రకాన్ని ఎగుమతి దారులు, వినియోగదారులు, ప్రాధాన్యత చూపకపోవడం వలన ఈ రకాన్ని ప్రోత్సహించకూడదని వ్యవసాయ అధికారులకు సూచించారన్నారు. […]

More

మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 17/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఎన్ కార్డ్ (జిల్లా స్థాయి కమిటీ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి & ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ) పై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గంజాయి సాగు నియంత్రణ, రవాణా, అమ్మకం, వినియోగం, అవగాహన, గంజాయికి బానిసలు అయిన వారికి వైద్య సహాయం, పునరావాసం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా […]

More

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 16/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పి సి & పి ఎన్ డి టి యాక్ట్, ఏఆర్టి అండ్ సరోగసి యాక్ట్ అమలుపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమాజంలో స్త్రీ, పురుషు బేధం ఉండకూడదని, అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉంటున్నారన్న విషయాన్ని […]

More

రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 16/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బి, వైద్యశాఖ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ […]

More