Close

Press Release

Filter by:

భారీ వర్షాలు కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 14/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం లేనందున నీరు తొలగితే పంటకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా సగటు వర్షపాతం 90 మిల్లీమీటర్ల కాగా బుధవారం ఒక్క రోజునే 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం […]

More

చిరు వ్యాపారులు సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తెలిపారు

Published on: 13/08/2025

బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామ సమైక్య భవనం నందు డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిరు వ్యాపారులకు “సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్” కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళల కోసం మహిళలు రుణాలు మంజూరు చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక మన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీల […]

More

ఈ-పంట డిజిటల్ క్రాఫ్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 13/08/2025

ఈ-పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రతి రైతు ఈ-పంటలో నమోదు కావాలి   గణపవరం మండలం కేశవరం గ్రామంలో బుధవారం ఖరీఫ్ 2025 ఈ-పంట డిజిటల్ క్రాఫ్ బుకింగ్ నమోదును కార్యక్రమమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ-పంట నమోదు ఎలా చేస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారా అని ఆరా తీశారు. సర్వే నెంబర్లు […]

More

మహిళా సమైక్య సభ్యులు వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికపురోభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 13/08/2025

బుధవారం ఉండి మండలం మహాదేవపట్నలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘంకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ.8.75 లక్షల సబ్సిడీతో మంజూరుచేసిన రూ.25 లక్షల వ్యయంతో నెలకొల్పిన “స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని” రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారుచేసే చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. […]

More

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం కావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/08/2025

ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫలను ‘హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మన ప్రధాని మోదీ […]

More

మానవతా సేవలు అభినందనీయం-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/08/2025

ప్రస్తుత తరుణంలో మానవీయతపై ఆలోచన చేసి ఆచరణలో అమలు చేస్తున్న మానవతా సంస్థ సేవలు అభినందినీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో మానవతా సంస్థ రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన శాంతి రథాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సంబంధాలు తగ్గుతున్న ఈ రోజుల్లో అనాధ శవాలు, పేదల భౌతికకాయాలు అంతిమ యాత్రగా […]

More

“విక్షిత్ భారత్” దార్శనికతను సాకారం చేసుకోవడానికి ప్రటిష్టమైన, అధిక నాణ్యత గల పాఠశాల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Published on: 12/08/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు “విక్షిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య – నిర్మాణ విభాగాలు” అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఒక్కరోజు వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని పలు సూచనలు, ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ప్రధానమంత్రి వ్యక్తీకరించబడిన “విక్షిత్ భారత్” దార్శనికత, భారతదేశాన్ని 100వ స్వాతంత్ర్య దినోత్సవంతో సమానంగా 2047 […]

More

పిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకొని రక్తహీనతకు దూరం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు .

Published on: 12/08/2025

మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నులిపురుగులు ప్రమాదకరమని వీటివల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశం అని ఆమె అన్నారు. ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సులోపు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగుల […]

More

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పటిష్టమైన విద్యను అందించేందుకు ఉచిత ప్రైవేటు తరగతులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 11/08/2025

సోమవారం భీమవరం దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన “విద్యా సౌజన్యం లెర్నింగ్ సెంటర్” (ఉచిత ప్రైవేట్ తరగతులను) ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య నుండే మెరుగైన విద్యను అందించడం ద్వారా చక్కటి విద్యకు పునాది పడుతుందన్నారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంటి వద్ద పాఠాలను చదివించడం, నేర్పించడం కష్టంగా ఉంటుందని, ఇటువంటివారికి ప్రైవేట్ తరగతులు ఎంతో […]

More

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతనికి అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 11/08/2025

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీన జిల్లా అంతటా నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికలను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలు, కిషోర్ బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారన్నారు. అదేవిధంగా శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారన్నారు. ఆల్బెండజోల్ 400 […]

More