పి4లో భాగంగా సంపన్నులు దిగువ పేద వర్గాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకు రావాలి-ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 30/07/2025పి4 లో భాగంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు […]
Moreపెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామం ఇనామ్ రికార్డులను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 30/07/2025పెంటపాడు మండలం తహసిల్దార్ కార్యాలయంను మంగళవారం ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి సంబంధించిన ఇనామ్ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో రెవిన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పుంతకు చెందిన భూ స్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామంలో నెంబర్.14 ప్రభుత్వ […]
Moreఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజ సేవే- జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 29/07/2025పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమ వంతు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పి4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాల వారిని ఆర్థికంగా, […]
Moreవివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకుర్లుకు విరివిగా రుణాలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/07/2025గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి లకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరు పై కలెక్టర్ ఆగ్రహం .. సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతుల అందరికీ రుణాలు అందించాలి చేనేత కార్మికులు ముద్ర రుణాలు మంజూరులో తాత్సారం ఎందుకు? పీఎం ఎఫ్ బి వై ప్రీమియం జమలో నిర్లిప్తత ఎందుకు? రైతులు పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా […]
Moreసమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 29/07/2025మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోస్, ఎంఈఓస్, ఏపీఎంస్, మున్సిపల్ కమిషనర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత 2025-26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ద్వారా జిల్లాలో 15 – 59 వయస్సు […]
Moreజీరో పోవర్టీ సమాజ నిర్మాణానికి స్థితిమంతులు ముందుకు రావాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/07/2025జిల్లాలో మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాలకు అనుసంధానం వేగవంతం చేయాలి. పి-4 గ్రామ సభలను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేయాలి. పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గం, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1,623 […]
Moreఅధిక పోషక విలువలు కలిగిన గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్ వినియోగానికి రైతుల ముందుకు రావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 28/07/2025జిల్లాలోని 20 మండలాల్లో 60 ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.. రైతులు ఎరువులు వినియోగం తగ్గించి, గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ ను వినియోగించాలి… ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి గ్రూప్ ల ద్వారా గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ తయారీ. జిల్లాలోని సాగు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన గుర్రపు డెక్కన్ తొలగించి రైతులకు మేలు చేసేలా వర్మీ కంపోస్ట్ ను తయారు చేసేందుకు సంబంధిత అధికారుల […]
Moreజిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 28/07/2025సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ, మత్స్య, మార్క్ఫెడ్ అధికారులతో ఎరువుల లభ్యత, వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు మొత్తం 58,905 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం గాక వాటిలో యూరియా 21,270 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 37,634 మెట్రిక్ టన్నులు అవసరం అన్నారు. జూలై నెలాఖరు నాటికి యూరియా 3,278 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు […]
Moreజిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు.
Published on: 28/07/2025జులై, 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు పిల్లల అక్రమ రవాణా వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన […]
Moreపిజిఆర్ఎస్ అర్జీదారులకు కూడా వీరవాసరం తులసి రాంబాబు నేటి సోమవారం నుండి మధ్యాహ్నం భోజనం అందజేత-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 28/07/2025రాంబాబును స్ఫూర్తిగా తీసుకొని దాతృత్వ హృదయం కలవారు పి-ఫోర్ కార్యక్రమానికి చేయూతనివ్వాలి.. సేవా తత్పరతతో మరింత మంది పి-ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ అర్జీదారులకు ప్రతి సోమవారం వీరవాసరం తులసి రాంబాబుచే ఏర్పాటుచేయనున్న భోజన సదుపాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వీరవాసరం తులసి రాంబాబు ఇప్పటికే వీరవాసరం మండలంలోని […]
More