Close

Press Release

Filter by:

కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్ డేటా అప్లోడ్ ని 25వ తేదీలోపు పూర్తి చేస్తాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/08/2025

సెప్టెంబరు 1వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,స్వర్ణాంధ్ర ప్రదేశ్ మానిటరింగ్ డాష్ బోర్డ్, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ […]

More

గోదావరి వరద ఉధృతికి కొద్దిపాటి నీరు చేరిన కనకా యలంక గ్రామాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ..

Published on: 21/08/2025

యలమంచిలి మండలం కనకాయలంక గ్రామానికి పడపై చేరుకున్న జాయింట్ కలెక్టర్ … నీట మునిగిన లంక గ్రామ వాసులకు భరోసా … కనకాయ లంకలో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాల ఆరా … … జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకా యలంకలో గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి వరద ఉధృతి […]

More

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. సేవా దృక్పథంతో మరింత మంది ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్ ను సందర్శించి, హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు, దివ్యాంగులు ప్రేమతో అందించిన గులాబీ పువ్వులను ఆప్యాయతతో పలకరిస్తూ తీసుకొని చిన్నారులను సంతోషపరిచారు. తొలుత జాతీయ రహదారికి […]

More

వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి

Published on: 20/08/2025

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నిషేధం ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదు. వినాయక చవితి పందిళ్లలో సాంప్రదాయ భక్తి పాటలను మాత్రమే వినిపించాలి వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి . జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వినాయక చవితిలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిషేదించాలని, ఉత్సవాలను ఘనంగా […]

More

గత సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 20/08/2025

బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందని, ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పోలింగ్ ఎక్కువ సమయం […]

More

ఫేస్ -1, ఫేస్ -2 రీసర్వే నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి– జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 19/08/2025

జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం రీసర్వే, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్.పి.ఎంలు ప్రగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేస్ వన్-1 లో పూర్తి కావాల్సిన ఐదు గ్రామాలలో రీ సర్వే పనులను వచ్చే శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేస్-2లో జరుగుతున్న 27 గ్రామాలకు సంబంధించి ప్రతి భూస్వామికి 9(2) నోటీసు […]

More

పశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల..

Published on: 19/08/2025

అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది… డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం మంత్రిత్వ […]

More

ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో ప్రధానం.. ఆనంద ఫౌండేషన్ సేవలు అభినందనీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 19/08/2025

మంగళవారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జె.పి.రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి కలెక్టర్ చేతులమీదుగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కంటి చూపు ఎంత ప్రధానమో, చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం అన్నారు. తరిగిన […]

More

గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 18/08/2025

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జల్లి కొమ్మర గ్రామానికి చెందిన ఆన్లైన్ మ్యుటేషన్ ఫైల్స్ ను పరిశీలించి డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా క్యాస్ట్ సర్వే ఏవిధంగా జరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్మర గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. పంట […]

More

ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతానికి దాతలు హితోదికంగా ముందుకు రావాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 18/08/2025

సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని వివి గిరి ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒక కోటి రూపాయల దాతృత్వంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపనకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం అదనపు గదుల నిర్మాణానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యను నేర్చుకోవడం […]

More