పిజిఆర్ఎస్ ఫిర్యాదుదారుల దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 15/09/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి. ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ […]
Moreధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 14/09/2025త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను […]
Moreకర్నూలు ఉల్లినే వినియోగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, రైతులకు లాభదాయకమైన ధరను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు
Published on: 14/09/2025ఆదివారం తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ ఉల్లి మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కడప, కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయలను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈరోజు జరిగిన ఉల్లి ఆక్షన్ ను స్వయంగా పరిశీలించారు. ఉల్లి ధర తక్కువ పలకడంతో హోల్ సేల్ వ్యాపారస్తులతో జేసీ మాట్లాడారు. కర్నూలు, కడప నుండి వచ్చిన ఉల్లి కొనటం ద్వారా రైతులు ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. మార్కెట్లో […]
Moreస్త్రీల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 13/09/2025శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంపై (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, పరీక్షలు, చికిత్సలు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈనెల ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ […]
Moreపశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ ఉచిత టీకా కార్యక్రమము సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 13/09/2025జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలు కార్యక్రమం అవగాహన గోడ పత్రికను శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 15వ తేదీ నుండి అక్టోబర్ 14 వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితముగా టీకాలు వేయు కార్యక్రమమును జిల్లా లోని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని […]
Moreఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు
Published on: 11/09/2025గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుండి రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా […]
Moreకర్నూలు ఉల్లికి మార్కెట్ పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉల్లితో తయారుచేసిన వంటకాలతో రైతులు, ట్రేడర్స్ తో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/09/2025కర్నూలు ఉల్లితో అన్ని రకాల వంటకాలు.. రైతులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్.. రాష్ట్రంలో పండించిన ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలుద్దాం.. సోలాపూర్ ఉల్లి కన్నా మన కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం.. జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.. గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి కొనుగోళ్ళను పరిశీలించి […]
Moreప్రపంచం సమాచార యుగం నుండి క్వాంటం యుగానికి కదులుతోంది, దీనికి యువతే మార్గదర్శకులు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 10/09/2025బుధవారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియం నందు నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదిక నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ హ్యాకథాన్ అనేది ఆలోచనలు, జట్టుకృషి, సమస్య పరిష్కారాల వేడుక అన్నారు. తక్కువ వ్యవధిలో, సృజనాత్మకత, కోడింగ్, సహకారం పరిశ్రమలు, సమాజాన్ని ఎలా రూపొందించగల పరిష్కారాలను […]
Moreకౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/09/2025జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల బ్యాంకు ఖాతాలో ఇంకను కొంతమందికి వివిధ […]
Moreప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించండి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/09/2025రసాయనరహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించండి. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు వైద్య శాఖ, డిఆర్డిఏ శాఖలతో జిల్లా స్థాయి కాన్సెర్వెన్సీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రసాయనక ఎరువులు, పురుగుమందుల వినియోగించకుండా, జీవసంబంధమైన పదార్థాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. […]
More