భీమవరం పట్టణంలోని స్మశానవాటికను స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని భీమవరం మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 29/04/2025మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గునుపూడి, బలుసుమూడి స్మశాన వాటికల అభివృద్ధి, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ల నిర్మాణాలపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని గునుపూడి స్మశాన వాటిక అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో రూపుదిద్దాలన్నారు. గునుపూడి స్మశాన వాటిక సుమారు 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీని అభివృద్ధికి 15వ ఆర్థిక […]
Moreప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యం అంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 29/04/2025మంగళవారం కాళ్ల మండలం పెద్దమిరం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లే అవుట్ లకు నిబంధనల ప్రకారం వదిలిన 10 శాతం ఖాళీ స్థలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. గ్రామ సర్వేయర్ కిషోర్ ఏఏ ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణం ఖాళీ స్థలాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణ వాసుల ఆహ్లాదానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు […]
Moreజిల్లాలో 263 రైతు సేవ కేంద్రాల ద్వారా ఒక కోటి 14 లక్షలు గోనె సంచులు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు
Published on: 29/04/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలోని రబీ పంట ధాన్యం కొనుగోలుపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని డివిజన్, మండల స్థాయి కొనుగోలు కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నేటికి 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 3,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యమును కనీస మద్దతు ధరకు కొనుగోలు […]
Moreకాళీపట్నం గ్రామం జమీందారీ భూములు హక్కులు కలిగించే ప్రక్రియలో సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలియజేస్తే వేగవంతమైన పరిష్కారానికి దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు తెలిపారు.
Published on: 29/04/2025సోమవారం కాళీపట్నం జమీందారీ భూములు సెటిల్మెంట్ హక్కులు కొరకు కాళీపట్నం రెవిన్యూ గ్రామ పరిధిలో ఉన్న జగన్నాధపురం, కోమటితిప్ప, పాతపాడు, కాళీపట్నం వెస్ట్, ఈస్ట్ పంచాయితీలు రైతులు సూచనలు సలహాలు అభిప్రాయాలు తెలుసుకునేందుకు జగన్నాధపురం హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళీపట్నం జమీందారీ […]
Moreసమస్య తమ శాఖ పరిధిలోనికి కానిపక్షంలో నిర్ణీత గడప వరకు ఉంచకుండా వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేయాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/04/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతంలో నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కానీ ఎడల మండల స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్య […]
Moreభీమవరం రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు త్వరలో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటు చేసి చికిత్సను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 28/04/2025సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సేవలకు గోల్డ్ మెడల్ ను సాధించడం అభినందనీయమని, దీనికి కృషి చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అభినందనీయులన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. మే 8న రెడ్ […]
Moreప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్ పి జి గ్యాస్ కనెక్షన్స్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు
Published on: 26/04/2025శనివారం జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి, బిపిసిఎల్, హెచ్ పిసిఎల్, ఐఓసీఎల్ గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్ లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది నాటి నుండి రెండు సంవత్సరాలుగా రీఫిల్ తీసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం […]
Moreదివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 25/04/2025శుక్రవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం-2016 అనుబంధం మార్గదర్శకాలు -2023 అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు, అసోసియేషన్ల ప్రతినిధులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చట్టం అమలుపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చట్టం అవగాహనకు 15 రోజుల్లో జిల్లా అధికారులకు ఒక వర్క్ షాప్ ను నిర్వహించాలని డిఆర్ఓకు సూచించారు. జిల్లాలోని […]
Moreపాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో యశస్విని ఆదర్శంగా తీసుకోవాలి ..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 25/04/2025శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన నిమ్మల యశస్విని ప్రత్యేకంగా అభినందించారు. ఏం చదవాలి అనుకుంటున్నావు అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించిన సందర్భంలో నేను పోలి సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నానని, పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్, ఐటిఐ కోర్సులు పూర్తి […]
Moreప్రభుత్వ పాఠశాలలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనపై ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Published on: 25/04/2025శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ పదో తరగతి పరీక్ష ఫలితాలు, ప్రభుత్వ పాఠశాలలో చేరికలు, అల్పదాయ వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు, బడి బయట పిల్లలు చేరికలు, ఆపార్ ఐడి నమోదు అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకు మేటిగా నిలుస్తుందో ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలన్నారు. కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు […]
More