స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 02/05/2025గురువారం అత్తిలి మండలం అత్తిలి, మంచిలి గ్రామాలలో మహిళా సమైక్య సభ్యుల ద్వారా నిర్వహిస్తున్న వివిధ స్వయం ఉపాధి యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలను చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మంచిలి గ్రామం సమైక్య భవనంలో ఎస్ హెచ్ జీ గ్రూపు సభ్యులు పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు […]
Moreప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, విద్యలో రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 02/05/2025గురువారం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బల్లిపాడు పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ లో పిఎం శ్రీ నిధులు రూ.15.58 లక్షల వ్యయంతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను, రూ.5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన వాలీబాల్, షటిల్, కబాడీ, లాంగ్ జంప్ కోర్టులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreసామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 01/05/2025మే నెల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య, ఒంటరి మహిళల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక దివ్యాంగులు, తదితరులకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం గురువారం అత్తిలి మండలం అత్తిలి యానాదుల పుంతలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యానాదుల పుంతలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛనుదారుల గృహాల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లను […]
Moreఅంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి
Published on: 01/05/2025గురువారం భీమవరం మండలం చిన్నఅమీరo సెంటర్ -3 అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రెటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ. సూర్య కుమారి ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించారు. వారి పేర్లును అడిగి తెలుసుకొని పాటలు పాడించి సరదాగా గడిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్న విద్యా బోధనలు పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు పట్టి […]
Moreజిల్లాలో మే 4న నీట్ యూజీ- 2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Published on: 30/04/2025బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నీట్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై నీట్ యూజీ అధికారులు, సూపరింటెండెంట్లు, విద్యా శాఖా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రెండు సెంటర్లను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిట్ లో ఒక పరీక్ష కేంద్రం, […]
Moreప్రజల సామాజిక అవసరాలకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను వినియోగములోనికి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 30/04/2025బుధవారం జిల్లా కలెక్టర్ కాళ్ల మండలంలోని పెద అమిరం పంచాయతీ పరిధిలోని పలు ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీఆర్వోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టాటా మార్గ్ (పెద అమిరం పుంత రోడ్డు) లోని మూడు లేఔట్లను, గుడివాడ రోడ్ లోని వెంకటాద్రి రాయల్ ఎస్టేట్ లేఅవుట్ లలో పంచాయతీకి కేటాయించిన 10 శాతం స్థలాలను పరిశీలించారు. రానున్న వారం రోజుల్లో లే అవుట్ల యజమానులతో సమావేశమై ప్రభుత్వ స్థలాల అభివృద్ధికి సంబంధించి చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి […]
Moreజిల్లాలో పోలీసెట్ ప్రవేశ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 30/04/2025బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం విష్ణు కాలేజీ బి.సీతా పాలిటెక్నిక్ కాలేజీ నందు ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు పరీక్షలు రాయడాన్ని స్వయంగా పరిశీలించారు. విష్ణు కాలేజీ సెంటర్ కు ఎంతమందిని కేటాయించారు, ఎంతమంది హాజరయ్యారు తదితర వివరాలను చీఫ్ కోఆర్డినేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పోలీసెట్ -2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటులను చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం […]
Moreమే 2న ప్రధానమంత్రి పాల్గొనే అమరావతి రాజధాని పునః నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 30/04/2025అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మే 2న గౌరవ ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో ప్రధాని సభకు వెళ్లేందు ప్రజలకు చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి రవాణా, తాగు నీరు సదుపాయం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభ వేదికకు చేరుకోవడం వంటి సన్నాహాక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
Moreమహిళా సమైక్యలు తయారు చేసే తినుబండారాలు, లేసు ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించే దిశగా అందమైన ప్రింటింగ్ డిజైన్స్ తో బాక్స్ ఐటమ్స్ ను తయారుచేసి అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రింటర్స్ ప్రతినిధులను కోరారు.
Published on: 29/04/2025మంగళవారం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందమైన ప్రింటింగ్ డిజైన్స్ తో ప్యాకింగ్ ఉత్పత్తులను తయారు చేసేందుకు డి ఆర్ డి ఏ, ఇండస్ట్రీస్ అధికారులు, ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై చర్చించారు. మంచి మంచి ఉత్పత్తులు తయారు చేయడం ఎంత ముఖ్యమో, మార్కెటింగ్ చేయడానికి ఆకర్షణయంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమన్నారు. మహిళా సమైక్య సభ్యులు జిల్లాలో తయారు చేసే పూతరేకులు, చాక్లెట్స్, లేస్ ఉత్పత్తులను అందమైన ప్రింటింగ్ డిజైనింగ్ […]
More