Close

News

ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు నూరు శాతం రాయితో పీఎం సూర్య ఘర్ సోలార్ ప్యానల్స్ అమరిక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Published on: 16/02/2026

ఎస్సీ/ ఎస్టీ గృహాలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెలుగులు ఎస్సీ, ఎస్టీ గృహాలకు నూరు శాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అమరిక ఒక్కొక్క కుటుంబానికి నూరు శాతం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు రూ.1.20 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.60 వేలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పథకం అమలుకు ఏప్రిల్ 13, 2026 ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలలో విద్యుత్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం […]

More

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 16/02/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 240 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 67 దరఖాస్తులు స్వీకరణ. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణరెడ్డి, […]

More

సాంఘిక శాస్త్రంలో కష్టమైన అంశాలను స్వయంగా బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 14/02/2026

భీమవరం పి ఎస్ ఎం బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన పదవ తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని కష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, విధులు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు […]

More

గ్యాస్, ఆయిల్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంపొందించాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 14/02/2026

భీమవరం పట్టణంలో శనివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్, ఆయిల్ వినియోగంపై నిర్వహించిన అవగాహన వాహనాన్ని, ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులు అయిన గ్యాస్, ఆయిల్ ను ప్రజలందరూ పొదుపుగా వాడాలని, ప్రత్యామ్నాయ వనరులైన ఎలక్ట్రికల్ వాహానాలు, సోలార్ వస్తువులు, పర్యావరణ హితమైన బయో ఆయిల్ ఉత్పత్తుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. […]

More

భక్తులు సేవే భగవంతుని సేవగా భావించాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 14/02/2026

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలన, అధికారులతో సమీక్ష ఆలయ పరిసరాలు సుందరంగా కనిపించాలి ఆలయానికి కిలోమీటరు దూరం వరకు ఆధ్యాత్మిక భావం కనిపించేలా ఏర్పాటు చేయాలి దాతలు ఇచ్చిన ప్రసాదాలు, అన్నదానం భక్తులు స్వీకరించేందుకు తగిన ఏర్పాటు చేయాలి అధికారులు ఆదేశాలు పంచారామ క్షేత్రాలు ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ప్రసిద్ధి చెందిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి శివరాత్రి […]

More

సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 14/02/2026

దామోదరం సంజీవయ్య 105వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దామోదరం సంజీవయ్య చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు దామోదరం సంజీవయ్య అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అట్టడుగు వర్గాల […]

More

జిల్లాలో ప్రముఖంగా ఉన్న రెండు పంచారామ క్షేత్రాలతో పాటు, ప్రాముఖ్యత కలిగన శైవాలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 13/02/2026

వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ సేవలపై ప్రజా సానుకూల స్పందన, మహాశివరాత్రి ఉత్సవాలు, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, కోర్టు భవనాల స్థలాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి స్థాయి […]

More

రానున్న ఉగాదికి లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందించేందుకు గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/02/2026

రానున్న వేసవిలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి త్రాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరా, టిడ్కో గృహాలు నిర్మాణ ప్రగతి, ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్, శానిటేషన్, డ్రైనేజీల నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, […]

More

వాణిజ్య పనులు, గనులు & భూగర్భ శాఖ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/02/2026

నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపులు జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి.. ఆదాయ ఆర్జన శాఖలు పన్నులు వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖతో కలిసి సమన్వయంతో పనిచేయాలి వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుంది జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిఎస్టీ సమన్వయ సమావేశాన్ని వాణిజ్య పన్నులు, ఆదాయ ఆర్జన శాఖలు అయిన […]

More

శారీరిక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 13/02/2026

విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పోడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతురాలు గోడి లక్ష్మి ప్రసన్న కు క్రచేస్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఏ విషయంలోనూ తక్కువ కాదని శారీరక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని […]

More