జిల్లాలో కూరగాయల సాగుకు రైతులను గుర్తించి అమలు పరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు.
Published on: 18/12/2024బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పంటల మార్పిడి విధానంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో గుర్తించిన కౌలు రైతులు అందరికి పంట రుణాలు ఇప్పించి ప్రధానమంత్రి పసల బీమా యోజన కింద రైతులని నమోదు చేయాలని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. […]
Moreఆడపిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని, స్వశక్తితో ఎదిగేందుకు చదువే మార్గమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 17/12/2024మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలోని జె.ఎన్.బి.ఎం జెడ్పి హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా తరగతి గదిలోని విద్యార్థుల వద్దకు వెళ్లి వారి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆడపిల్లలు స్వసక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. హై స్కూల్ స్థాయిలో 9,10 తరగతులు చాలా కీలకమని, మ్యాక్స్, ఫిజిక్స్, సైన్స్ సబ్జెక్టుల నందు మంచి పట్టు సాధించాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత అనంతరం ఏ ఏ […]
Moreభూ సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుచున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
Published on: 17/12/2024మంగళవారం అత్తిలి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవిన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భానో అధ్యక్షతన జరిగిన రెవిన్యూ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సదస్సులో పలువురు రైతుల నుంచి భూ సమస్యలు, పాస్ బుక్కు సమస్యలు, రీ సర్వే, ముటేషన్ కు సంబంధించిన తదితర అంశాలపై పలువురు రైతులు నుండి 45 దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా స్వీకరించారు. […]
Moreధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనే సంచులు అన్ని రైతు సేవ కేంద్రాల్లో అందుబాటు లో ఉన్నాయి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
Published on: 17/12/2024మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అత్తిలి పర్యటనలలో భాగంగా మార్గమధ్యలో ఉండి మండలం ఎండగండి గ్రామంలో రోడ్డుపై రైతులు నెట్టు కట్టిన ధాన్యం బస్తాలను, పట్టుబడికి రైతు మోటర్ బైక్ పై తీసుకెళుతున్న గోనెసంచులను చూసి ఆగి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనెసంచులు ఇబ్బంది లేకుండా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతం వరకు కోతలు పూర్తి అయినవని […]
Moreమహిళలు అన్ని రంగాల్లో రాణించాలి .. మహిళా రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 17/12/2024మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట వేమవరంలో జరిగిన రెవిన్యూ సదస్సులో పాల్గొని తిరిగివస్తు మార్గం మధ్యలో వీరవాసరం మండలం కొణితవాడ గ్రామంలో కొడి మంగమ్మ మహిళా రైతు రోడ్డు పక్క పొలంలో ధాన్యం పడుతున్న దృశ్యమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చూసి, వాహనము దిగి మహిళా రైతు వద్దకు వెళ్లి మాట్లాడారు. మీకు ఎన్ని ఎకరములు పొలము ఉన్నది, పంట బాగా పండినదా, ఏ వెరైటీ సాగు చేసారు, ఎకరాకు ఎంత దిగుబడి […]
Moreవిస్సాకోడేరు వంతెన పక్కన ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి నివేదిక సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
Published on: 17/12/2024మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తో కలిసి విస్సాకోడేరు వంతెన పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎంత విస్తీర్ణం ఉంది కొలతలు వేసి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పరంగా భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు, టౌన్ ప్లానింగ్ […]
Moreజిల్లాలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్చతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు .
Published on: 16/09/2024దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్చతాహి సేవా కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్ గా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్చతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17 న ప్రారంభోత్సవం ఉంటుందని,18 నుండి అక్టోబర్ 1 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. […]
Moreఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ద్వారా 19 ఏళ్ల లోపు పిల్లలు అందరూ ఆల్ బెండజోల్ మాత్రలు తప్పక వేసుకనేలా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 15/09/2024బాలబాలికలలో రక్తహీనతకు ప్రధానంగా జీర్ణవ్యవస్థలో చేరిన నులి పురుగులు కారణమౌతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు. జిల్లాలోని 1,617 అంగన్ వాడీ కేంద్రాలు, అన్ని యాజమాన్యాల క్రింద 1,894 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, […]
Moreఈ నెల 17వ తేది నుంచి అక్టోబరు 2వ తేది వరకు నిర్వహించే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 13/09/2024శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతోను, మీకోసం సమావేశ మందిరం నందు పంచాయతీరాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖ తదితర అధికారులతో విడివిడిగా సమావేశం అయ్యారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ప్రణాళిక చర్యలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి మాట్లాడుతూ భారత ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సంవత్సరం స్వచ్ఛత హి సేవ […]
Moreవరి పంట దెబ్బతిన్న కౌలు రైతులు నమోదులో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు .
Published on: 13/09/2024శుక్రవారం కాళ్ల మండలం కాళ్ల గ్రామంలో అధిక వర్షాలు కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించి, ఎన్యుమరేషన్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పంట నమోదులో అర్హత కలిగిన ఏ ఒక్క కౌలు రైతు మిస్ అవకుండా నమోదు చేయాలని, అలాగే అర్హత లేని ఏ ఒక్కరిని నమోదు చేయకూడదని ఆదేశించారు. ఏదైనా తప్పు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. కాళ్లలో […]
More