ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకుల కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 22/04/2025సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్యా అర్హతలతో పాటు పోటీ పరీక్షలు నందు అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా అర్హతలు, పోటీ పరీక్షలు ప్రామాణికంగా ఉపాధ్యాయుల ఎంపిక ఉండదనే […]
Moreప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు
Published on: 21/04/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి పంచాయితీ, రెవెన్యూ, భూ సమస్యలు, సర్వే, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డి ఆర్ డి ఎ, ఐసిడిఎస్, వయోవృద్ధుల సంక్షేమం, తదితర శాఖలకు సంబంధించిన 237 అర్జీలను స్వీకరించారు. అందిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల డివిజన్, మండల […]
Moreడ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 21/04/2025శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్ లతో సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల ఋణమును అందజేస్తుందన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు గ్రూపులు కట్టవలసిన ఐదు లక్షలు బ్యాంకులో జమ చేస్తే, […]
Moreజిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 19/04/2025శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. వివిధ పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులను అన్ని శాఖలు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని […]
Moreచెత్త నియంత్రణ, నిర్మూలన ద్వారా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకునే అంతగా ప్రజలు చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 19/04/2025రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, గ్రామాలుగా రూపుదిద్దేందుకు చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడో శనివారం ఇ- వెస్ట్ అనే థీమ్ తో నిర్వహిస్తోంది. శనివారం తాడేపల్లిగూడెం నాలుగవ వార్డు అమ్మ కళ్యాణ వేదిక నందు ఇ – వేస్ట్ అవగాహన కార్యక్రమంలో, 14వ వార్డు బి.ఆర్ మార్కెట్ నందు తడి చెత్తను కంపోస్ట్ గా మార్చే పక్రియ పరిశీలన […]
Moreతణుకు పట్టణంలోని పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, దాతలు సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.
Published on: 18/04/2025శుక్రవారం తణుకు పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పి-4 లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం భాగంగా పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు తణుకు శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకు పట్టణంలో పారిశ్రామికవేత్తలు, దాతలు పట్టణంలో పార్కులు, బస్ షెల్టర్స్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల […]
Moreపట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 18/04/2025గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎమ్ఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎమ్ఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా […]
Moreమండలంలో చేపట్టే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల వివరాలు జెపిటిసి లకు తెలియజేయాల్సిందే: జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ
Published on: 17/04/2025మండలంలో చేపట్టే ప్రభుత్వ అధికారిక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం సంబంధింత జెడ్పిటిసిలు, ఎంపిపి లు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, ప్రోటోకాల్ ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమాచారం, చేపట్టే పనులు వివరాలు సంబంధిత శాఖల అధికారులు తమకు తెలియజేయడం లేదని, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందించడం లేదని పలువురు జెడ్పిటిసి లు సభ దృష్టికి […]
Moreజిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 17/04/2025బుధవారం తణుకు పట్టణంలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల – 1 & 2 బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహముల నిర్వహణను మరియు పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. మీరు బాగా చదువుకుంటున్నారా వసతి గృహంలో మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి. భోజనములు ఎలా ఉంటున్నాయి మెనూ ప్రకారం పెడుతున్నారా అని అడిగారు. మీకు […]
More