Close

నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి(IAS)

భీమవరం:- శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మధ్యాహ్నం భోజన పథకం పరిశీలించారు. స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. క్యూలో నిలబడి ప్లేట్ పట్టుకుని భోజనము పెట్టించుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను కుశల ప్రశ్నలతో ఉత్సాహపరిచారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుంది అన్నారు. తద్వారా చదువులోను ఆటలలోను చురుగ్గా రాణించగలరు అన్నారు.