• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

SUPER GST SUPER SEVING W:G:DIST COLLECTOR SMT C. NAGARANI (IAS)

సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి*.*….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి*.శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి సంస్కరణల అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.