Close

విద్యార్థులకు కళ్ళజోళ్ళు అందిస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం మండలం చినఅమీరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సరైన కంటి చూపుతోనే ఏకాగ్రత ఉంటుందని, లేకపోతే చదువులో కూడా రాణించలేరని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల కంటి చూపు పై ప్రత్యేక శ్రద్ధ వహించటం తో పాటు ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలన్నారు. బొప్పాయి తరచూ తినాలన్నారు. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి అని వాటి వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో 14 మండలాల్లో 212 పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువు చున్న 35,312 విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 2695 మంది దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి 2045 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కళ్ళజోళ్ళు ధరించటం రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఉన్న అలవాటు అవుతుందని కళ్ళజోళ్లను తప్పక వినియోగించాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.