జీవన శైలిలో యోగ దిన చర్యగా చేసుకోవాలి ప: గో: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రతిఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలి. శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగ ఒక సంజీవని. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతి కేంద్రం ప్రాంగణంలో యోగ అభ్యసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. సుమారు 150 మంది పాల్గొన్న కార్యక్రమంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అభ్యాసన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. శారీరక,మానసిక దృఢత్వానికి యోగ సంజీవని అన్నారు. మహిళలలో స్ఫూర్తి నింపేందుకు తాను ప్రతి రోజు యోగా కార్యక్రమానికి హాజరవుతున్నానన్నారు. మహిళలు తమ జీవిత భాగస్వామికి కూడా యోగ పై అవగాహన కల్పించి కలిసి యోగా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.