Close

జిల్లాలో దశలవారీగా ప్లాస్టిక్ నిర్మూలన

జిల్లాలో దశలవారీగా ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇప్పటికే భీమవరం పట్టణంలోని అన్ని టీ స్టాల్స్ లో మద్యం షాపుల్లో ప్లాస్టిక్ టీ గ్లాసులు వాటర్ గ్లాసులు వివిధ వాణిజ్య అంగళ్లలో క్యారీ బ్యాగులు నిషేధిస్తూ ప్రకటన చేయడం జరిగిందన్నారు. కర్రీ పాయింట్ లో వాడే కవర్లు హోటల్స్ లో వినియోగించే ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ కారణంగా లక్షలాదిమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది అన్నారు. హైదరాబాద్ ఏ.ఈ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలిసి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వారు తయారు చేసిన బయో ఎలైట్ ఉత్పత్తులను ప్రదర్శించటం జరిగినది. వాటర్ బాటిల్స్ వాటర్ గ్లాసులు వివిధ రకాల క్యారీ బ్యాగులు డస్ట్ బిన్ కవర్లు రెస్టారెంట్లోలో వాడే వివిధ రకాల సైజుల్లో బాక్సులు భోజన ప్లేట్లు, మొక్కజొన్న కండి లోపలి భాగాన్ని వినియోగించి తయారు చేయడం జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇవి త్వరగా భూమిలో డీ కంపోస్ట్ అవుతాయని వివరించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి. పరిశీలించి *డైక్లోరో ఈథన్ ద్రావణంతో పనికి చేయించడం జరిగినది. ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు అయితే ఈ ద్రావణంలో కరగవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.