కలెక్టర్ చొరవతో చిన్నారి దివ్య రాణి నడక నేర్చింది,తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం వచ్చింది
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన ఒక చిన్నారి కి నడక నేర్పింది అంటే ఒక వింత ఆశ్చర్యం విన్నవారికి సంతోషం కలగక మానదు జీవితాంతం దివ్యాంగురాలుగా ఉండి పోవలసిన చిన్నారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో నడవ గలుగుతుంది*ప్రతి సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కు 7 సంవత్సరాల పాపను భుజాన వేసుకొని ఒక తల్లి పింఛన్ ఇప్పించమని పెన్నాడ గ్రామం నుండి వచ్చింది, పాపను చూసి చలించిన కలెక్టర్ పాప ఉజ్వల భవిష్యత్తును ఆలోచించి చిన్నపిల్లల వైద్యులతో పరీక్షలు చేపించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పిల్లల వైద్యులతో చికిత్స ఇపిస్తూ అన్నపూర్ణ ఫిజియోథెరపీ & రిహాబిడేషన్ సెంటర్ నందు ఫిజియో థెరపీని ఇప్పించారు. జిల్లా కలెక్టర్ చూపిన చొరవతో జీవితాంతం దివ్యాంగురాలుగా ఉండవలసిన పాప దివ్య రాణి తనంతట తాను నడిచే స్థితికి వచ్చింది, చిన్నారికి మంచి భవిష్యత్తును అందించి నందుకు కలెక్టర్ కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.