అర్హులైన వారికి ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ సొమ్ము అందజేత ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి*
పేద బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి* శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అర్హులైన వారికి పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల తో ఆయన మాట్లాడారు. వయోవృద్ధులు వికలాంగులతో పాటు పేద బలహీన వర్గాలకు బాసటగా ప్రతినెలా ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ సొమ్మును అందించడం జ రుగుతుందన్నారు. లబ్ధిదారులు పింఛన్ సొమ్మును పొదుపు చేసుకుని అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు.