యోగ అభ్యాసనం ఆరోగ్యానికి మాత్రల పనిచేస్తుంది జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
యోగ అభ్యాసనం ఆరోగ్యానికి మాత్రల పనిచేస్తుంది జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూన్ 21,అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి, ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, డి ఏస్ పి డా.శ్రీ వేద,వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సుమారు 2000 మంది, యోగ శిక్షకులు ఇచ్చిన యోగ అభ్యాసాలను అనుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగ అభ్యాసములు మాత్రల పని చేస్తాయని అన్నారు.జీవితంలో యోగాను దినచర్యగా చేసుకోవాలి అన్నారు.
ప్రతి ఒక్కరూ యోగాసనంలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.