Press Release

Filter by:

పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/04/2025

గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎమ్ఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎమ్ఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా […]

మండలంలో చేపట్టే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల వివరాలు జెపిటిసి లకు తెలియజేయాల్సిందే: జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

Published on: 17/04/2025

మండలంలో చేపట్టే ప్రభుత్వ అధికారిక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం సంబంధింత జెడ్పిటిసిలు, ఎంపిపి లు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, ప్రోటోకాల్ ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమాచారం, చేపట్టే పనులు వివరాలు సంబంధిత శాఖల అధికారులు తమకు తెలియజేయడం లేదని, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందించడం లేదని పలువురు జెడ్పిటిసి లు సభ దృష్టికి […]

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 17/04/2025

బుధవారం తణుకు పట్టణంలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల – 1 & 2 బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహముల నిర్వహణను మరియు పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. మీరు బాగా చదువుకుంటున్నారా వసతి గృహంలో మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి. భోజనములు ఎలా ఉంటున్నాయి మెనూ ప్రకారం పెడుతున్నారా అని అడిగారు. మీకు […]

రైతు సేవా కేంద్రం ద్వారా రైతులు ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలి, పిల్లలను బాగా చదివించాలి.. జిల్లా కలెక్టర్ నాగరాణి

Published on: 17/04/2025

బుధవారం పెద్ద తాడేపల్లి రైతు సేవా కేంద్రమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. దాన్యం కొనుగోలు కేంద్రాలు పనితీరు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సకాలంలో జరుగు జరుగుచున్నవన, 24 గంటల వ్యవధిలో ఎకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అని తెలుసుకున్నారు. గోనెసంచులు సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు సకాలంలో సహకరిస్తున్నారని చెప్పారు. ఇంత త్వరగా […]

రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించే లక్ష్యంతో ఖచ్చితమైన ప్రయోగ ఫలితలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 17/04/2025

బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం ప్రయోగశాల నందు రూ.27 లక్షలతో ఏర్పాటుచేసిన అటోమిక్ అబ్సెర్ప్షన్ స్పెక్ట్రో ఫోటోమీటర్ ను, రూ.21 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ లిక్విడ్ చోరోమెటోగ్రఫీ మిషనరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రయోగ పరీక్షలు నిర్వహించే విధానాన్ని శిక్షణ పొందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులలో సూక్ష్మ, స్థూల పోషకాలను పరీక్షించేందుకు […]

ఆరోగ్యవంతమైన బిడ్డలు కలిగేందుకు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుని, క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 16/04/2025

ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా భీమవరం శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారన్నారు. ఆరోగ్యవంతమైన బావి […]

జిల్లాలో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా రానున్న వర్షాకాలం కంటే ముందుగా అన్ని నియోజకవర్గాల్లో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 15/04/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఆర్డీవోలు, డిటిఓ, మండల రెవెన్యూ అధికారులు, ఇసుక స్టాక్ పాయింట్స్ నిర్వహణ ఏజెన్సీదారులు, ట్రాన్స్పోర్ట్ వాహన యజమానులతో ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు […]

సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉండి నియోజకవర్గంలో రూ.3 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు … రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు

Published on: 15/04/2025

ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, త్రాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు సామాజిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని దీనికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద పి 4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతా దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజవర్గానికి చెందిన అనేకమంది దాతలు […]

భారత రాజ్యాంగం పితామహుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని రాష్ట్ర ఉప శాసన సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు

Published on: 15/04/2025

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భీమవరం అంబేద్కర్ సర్కిల్ నందు వున్న విగ్రహానికి రాష్ట్ర ఉప శాసనసభ పతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భారతదేశం ఇంత ఐక్యంగా ఉన్నది […]

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Published on: 15/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించి […]