Close

Press Release

Filter by:

జిల్లాలోని మహిళలు గుర్రపు డెక్క ద్వారా వర్మి కంపోస్ట్, వివిధ వస్తువులు తయారుచేసి, మార్కెటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 28/03/2025

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వంతెన వద్ద డ్రైన్ లో గుర్రపు డెక్కను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న మహిళలతో గుర్రపు డెక్కను ఎలా సద్వినియోగం చేయవచ్చు, ఆదాయాన్ని ఎలా పొందవచ్చు వివరించారు. గుర్రపు డెక్క కారణంగా సాగునీటి ప్రవాహానికి అంటంకంగా ఉండటంతో వరదలు సమయంలో జిల్లాలోనీ వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. దీనిని నివారించేందుకు ఆలోచనచేసి గుర్రపు డెక్కను వినియోగించి వర్మీ కంపోస్ట్, ప్రత్యామ్నాయ వస్తువులు […]

More

జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటు చేయటంతో పాటు, పొదుపు చేయడంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 28/03/2025

శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇటీవల అమరావతిలో జరిగిన ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించి ప్రస్తావించిన అంశాలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటుచేసి, సంపాదనను పొదుపు చేసుకోవడం ఎలాగో పూర్తి అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. మహిళా గ్రూపులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ రణాలను సద్వినియోగం చేసుకునేలా […]

More

ప్రతి ఒక్క ముస్లిం భక్తి, శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ, పేద ప్రజలకు దానధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 28/03/2025

గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పరిష్కరించుకుని భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్ నందు నిర్వహించిన “ఇఫ్తార్ విందు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది […]

More

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ ఆదేశించారు.

Published on: 27/03/2025

ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌ నందు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని గురువారం నిర్వ‌హించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగువారి సంప్ర‌దాయం ఉట్టిప‌డే విధంగా మామిడాకుల తోర‌ణాలు, అర‌టి చెట్ల‌తో అలంక‌ర‌ణ‌లు చేయాల‌ని సూచించారు. ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం, వేదాశీర్వ‌చ‌నం, ఉగాది ప‌చ్చ‌డి, ప్ర‌సాదాల ఏర్పాటు, వేదిక అలంక‌ర‌ణ బాధ్య‌త‌ల‌ను, వేదిక‌పై బ్యాక్ డ్రాప్ ఏర్పాటును దేవాదాయ‌శాఖ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. సౌండ్ సిస్ట‌మ్, లైవ్ […]

More

రైతులు సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 25/03/2025

మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వరి పొలాలు సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడటం, లాభసాటి వ్యవసాయంపై రైతులకు […]

More

ఏసమ్మ బాధకు ఉపశమనం .. ఒక లక్ష రూపాయలు చెక్కును సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి అందుచేత.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/03/2025

రాష్ట్ర ముఖ్యమంత్రి తణుకు పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీకై పరుగులు పెట్టిన అధికారులు… ఫోటో ఆధారంగా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇల్లు జల్లెడ పట్టి బాధితురాలని వెతికి పట్టుకున్న వైనం.. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఒక లక్ష రూపాయలు బాధిత మహిళకు అందజేత… ముఖ్యమంత్రి దయాద్ర హృదయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మార్చి 15న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన […]

More

అమర జీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 17/03/2025

ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మరియు ఆర్యవైశ్యుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవంలో పాల్గొని భీమవరం శ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]

More

అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 17/03/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, సంయుక్తంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. […]

More

పదవ తరగతి పరీక్షల నిర్వహణను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిచేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 17/03/2025

సోమ‌వారం నుంచి ప్రారంభమైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వహణను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణంలోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోత్సవ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తొలుత త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించి, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో వెలుతురుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యార్ధులతో మాట్లాడుతూ పరీక్షలు వ్రాసేటప్పుడు ఏ విధమైన ఒత్తిడికి గురికాకుండడా ప్రశాంతముగా ఉండాలని, అప్పుడే పరీక్షలు బాగా రాయగలుగుతారని సూచించారు. విద్యార్ధుల‌కు ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇత‌ర […]

More

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి….ఎన్టీఆర్ పార్కులో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేసిన ముఖ్యమంత్రి

Published on: 15/03/2025

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పరదాలు కట్టుకుని తిరిగారు సుస్థిరమైన ప్రభుత్వంతోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం తణుకులో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ పార్కులో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేసిన ముఖ్యమంత్రి స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ […]

More