మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 25/08/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. నరసాపురం పట్టణానికి చెందిన విశ్వేశ్వర సేవా సదన్ డా.కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు, శిరిపుష్ప దంపతులు తయారుచేసిన వినాయకుని మట్టి విగ్రహాలను కలెక్టరేట్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన జలవనరులు కలుషితమై […]
Moreప్రజా ఫిర్యాదులు పరిష్కారంలో చక్కటి భాష, సంభాషణ శైలితో వ్యవహరించి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 25/08/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు […]
Moreరాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా నేడు స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ చేపట్టడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
Published on: 25/08/2025సోమవారం పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని, స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అధికారం ఇస్తే అభివృద్ధి వైపు నడపాలని, విధ్వంసం వైపు కాదని పేర్కొన్నారు. కూటమి […]
Moreకొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/08/2025రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహణ.. కార్డు ముందు భాగంలో కుటుంబ సభ్యుల ఫొటో, వెనుక ప్రభుత్వ వివరాలు ఉంటాయి… గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి కార్డుల పంపిణీకి చర్యలు.. కొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా వ్యాప్తంగా రేపటినుండి క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు […]
Moreఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని, పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/08/2025శనివారం ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతిని వెలిగించి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ […]
Moreవర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకు పరిశుభ్రతను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 23/08/2025శనివారం ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో జరిగిన స్వర్ణాంధ – స్వచ్ఛాంధ్ర లో భాగంగా “వర్షాకాల పరిశుభ్రత” థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చెత్త తొలగింపు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్ కు ప్రోత్సాహం ఇచ్చారు. అనంతరం దోమల నిర్మూలనకు గ్రామంలోని డ్రైయిన్ లో ఆయిల్ బాల్స్ ను విడిచి పెట్టారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా […]
Moreమట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 22/08/2025శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన “పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమం” కు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హితము చేసే మట్టి వినాయకులతోనే చవితి పండుగను జరుపుకోవాలని కోరారు. పర్యావరణహితమైన […]
Moreకీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్ డేటా అప్లోడ్ ని 25వ తేదీలోపు పూర్తి చేస్తాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/08/2025సెప్టెంబరు 1వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,స్వర్ణాంధ్ర ప్రదేశ్ మానిటరింగ్ డాష్ బోర్డ్, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ […]
Moreగోదావరి వరద ఉధృతికి కొద్దిపాటి నీరు చేరిన కనకా యలంక గ్రామాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ..
Published on: 21/08/2025యలమంచిలి మండలం కనకాయలంక గ్రామానికి పడపై చేరుకున్న జాయింట్ కలెక్టర్ … నీట మునిగిన లంక గ్రామ వాసులకు భరోసా … కనకాయ లంకలో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాల ఆరా … … జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకా యలంకలో గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి వరద ఉధృతి […]
Moreశ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. సేవా దృక్పథంతో మరింత మంది ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/08/2025గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్ ను సందర్శించి, హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు, దివ్యాంగులు ప్రేమతో అందించిన గులాబీ పువ్వులను ఆప్యాయతతో పలకరిస్తూ తీసుకొని చిన్నారులను సంతోషపరిచారు. తొలుత జాతీయ రహదారికి […]
More